యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ - YouWorship
Yaajaka Dharmamu Nerigi Yesunike Seva
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: యాజక ధర్మము నెరిగి - యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు (2) 1. ఆది ప్రధాన యాజకు డహరోను - ప్రభునికే ముంగురుతు (2) అతని కుమారులు విశ్వాసులకు (2) - ప్రాపుగ ముంగురుతు (1) 2. ప్రధాన యాజకుడు మనయేసే - యాజకులము మనమే పరమ పిలుపులో నిలిచినవారే - స్థిరముగ నుండెదరు 3. నాదాబు యనగా మనసున్నవాడని - అబీహువు నా తండ్రి ఎలియేజరనగ దేవుడు నా బలము -ఈతామారు ఖర్జూర భూమి 4. అహరోను ధరించిన వస్త్రములేడు - వాని యర్ధమేమి? ప్రభుయేసు వాని యందున్న - వాడు రక్షింపబడిన వారును 5. పతకము, ఏఫోదు, విచిత్రమైన దట్టీ - నిలువుటంగీ, పాగ మేలిమి బంగరు రేకు, విచిత్ర - మైన చొక్కా ఏడును 6. ఆయనతోడ వేయి వత్సరములు - ఆనందముతో నేలుచు యాజకులందరు భాగ్యశాలులై - హల్లెలూయ పాడెదరు Pallavi: Yaajaka Dharmamu Nerigi - Yesunike Seva Prematho Nonarimpudu (2) 1. Aadi Pradhaana Yaajaku Daharonu - Prabhunike Mungguruthu (2) Athani Kumaarulu Vishvaasulaku (2) - Praapuga Mungguruthu (1) 2. Pradhaana Yaajakudu Manayese - Yaajakulamu Maname Parama Pilupulo Nilichinavaare - Sthiramuga Nundedaru 3. Naadaabu Yanagaa Manasunnavaadani - Abeehuvu Naa Thandri Eliyejaranaga Devudu Naa Balamu -Eethaamaaru Kharjoora Bhoomi 4. Aharonu Dharinchina Vasthramuledu - Vaani Yardhamemi? PrabhuYesu Vaani Yandunna - Vaadu Rakshimpabadina Vaarunu 5. Pathakamu, Ephodu, Vichithramaina Dattee - Niluvutanggee, Paaga Melimi Banggaru Reku, Vichithra - Maina Chokkaa Edunu 6. Aayanathoda Veyi Vathsaramulu - Aanandamutho Neluchu Yaajakulandaru Bhaagyashaalulai - Hallelooya Paadedaru