మోయలేని భారమంత - YouWorship
Moyaleni Bhaaramantha
Artist: సాయారం గట్టు
Category: Good Friday
Song Lyrics
మోయలేని భారమంత సిలువలో మోసావు నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2) అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు నాదు గతిని మార్చావు – (2) కడలి పై నడిచిన పాదాలు సిలువ బరువుకు తడబడి పోయే స్వస్థతలు చూపిన హస్తములు సిలువలో శీలలతో వ్రేళాడే (2) ఇంత ఘోరము మోపిన నేరము నేను చేసిన పాప భారము (2) || మోయలేని || జయము నీకని పలికిన జనము మహిమ ఏదని నిను నిలదీసిరి పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు తెలిపిరి (2) తాకినంతనే మహిమ నొసగిన నీదు వస్త్రము చీట్ల పరము (2) || మోయలేని || దైవ సుతుడవు అయినా గాని దొంగలతో దోషిగా నిను చేర్చిరి మధుర వాక్యము నేర్పిన నోటికి చేదు చిరకతో దాహము తీర్చిరి (2) ఇంత జరిగిన ఎంత కరుణ వదలవేమయ నీ క్షమాపణ (2) || మోయలేని || Moyaleni Bhaaramantha Siluvalo Mosaavu Neeku Naaku Dooramantha Kalvarilo Nadichaavu (2) Anthuleni Needu Premaku Rujuvu Choopaavu Madhuramaina Nee Sannidhiki Daari Vesaavu Naadu Gathini Maarchaavu – (2) Kadalipai Nadichina Paadaalu Siluva Baruvuku Thadabadipoye Swasthathalu Choopina Hasthamulu Siluvalo Silalatho Vrelaade (2) Intha Ghoramu Mopina Neramu Nenu Chesina Paapa Bhaaramu (2) ||Moyaleni|| Jayamu Neekani Palikina Janamu Mahima Edani Ninu Niladeesiri Paapamulu Kshamiyinchina Ninnu Paapivani Palumaarulu Thelipiri (2) Thaakinanthane Mahima Nosagina Needu Vasthramu Cheetla Paramu (2) ||Moyaleni|| Daiva Suthudavu Ainaa Gaani Dongalatho Doshigaa Ninu Cherchiri Madhura Vaakyamu Nerpina Notiki Chedu Chirakatho Daahamu Theerchiri (2) Intha Jarigina Entha Karuna Vadalavemaya Nee Kshamaapana (2) ||Moyaleni||