మేలు చేయక - YouWorship
Melu Cheyaka
Artist: జోబ్ దాస్
Category: Praise
Song Lyrics
మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా|| Melu Cheyaka Neevu Undalevayyaa Aaraadhinchaka Nenu Undalenayyaa (2) Yesayya.. Yesayya.. Yesayya.. Yesayya (2) ||Melu Cheyaka|| Ninnu Namminatlu Nenu Vere Evarini Nammaledayya Neeku Naaku Madhya Dooram Tholaginchaavu Vadilundaleka (2) Naa Aanandam Korevaadaa – Na Ashalu Theerchevaadaa (2) Kriyalunna Prema Needi – Nijamaina Dhanyatha Naadi ||Yesayya|| Aaraadhinche Velalandu Needu Hasthamulu Thaakaayi Nannu Paschaaththaapam Kalige Nalo Nenu Paapinani Grahiyinchagaane (2) Nee Meellaku Alavaatayyi Nee Paadamlu Vadalakuntin (2) Nee Kishtamaina Daari Kanugontini Neetho Cheri ||Yesayya|| Paapamulu Chesaanu Nenu Nee Mundara Naa Thala Eththalenu Kshamiyinchagalge Nee Manasu Odaarchindi Naa Aaraadhanalo (2) Na Hrudayamu Neetho Andi Neeku Verai Manalenani (2) Athishayincheda Nithyamu Ninne Kaligi Unnanduku ||Yesayya||