మేలుకో మహిమ రాజు - YouWorship
Meluko Mahima Raaju
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
మేలుకో! మహిమ రాజు వేగమే రానై యున్నాడు (2) పరమునుండి – బూర ధ్వనితో అరయు నేసు – ఆర్భాటముతో (2) సర్వలోకము – తేరిచూచును త్వరపడు ఓ ప్రియుండా (2) ||మేలుకో|| గురుతులెల్ల – ధరణియందు సరిగ చూడ – జరుగుచుండ (2) చిరునవ్వుతో – చేరి ప్రభుని త్వరపడు ఓ ప్రియుండా (2) ||మేలుకో|| క్రీస్తునందు – మృతులెల్లరు కడబూర – మ్రోగగానే (2) క్రీస్తువలె – తిరిగి లేతురు లేతువా? నీవు ప్రియుడా (2) ||మేలుకో|| అరయంగ – పరిశుద్ధులు మురిసెదరు – అక్షయ దేహులై (2) పరమందు – ప్రభుక్రీస్తు నిరతము – ఓ ప్రియుండా (2) ||మేలుకో|| కరుణలేని – ఓ మరణమా నిరతము నీకు జయమగునా (2) మరణ సంహా – రుండేసు త్వరగా – రానై యున్నాడు (2) ||మేలుకో|| మాంసలోక – పిశాచాదులు హింస పరచ – విజృంభించిన (2) లేశమైనను – జడియకుము ఆశతో – కాచుకొనుము (2) ||మేలుకో|| పాపమును – చేయకుమా రేపకుమా – దైవ కోపమును (2) శాపమును – తప్పుకొని శ్రద్ధతో – కాచుకొనుమా (2) ||మేలుకో|| Meluko! Mahima Raaju Vegame Raanaiyunnaadu (2) Paramu Nundi – Boora Dhwanitho Arayu Nesu – Aarbhaatamutho (2) Sarvalokamu – Theri Choochunu Thvarapadu O Priyundaa (2) ||Meluko|| Guruthulella – Dharaniyandu Sariga Chooda – Jaruguchunda (2) Chirunavvutho – Cheri Prabhuni Thvarapadu O Priyundaa (2) ||Meluko|| Kreesthu Nandu – Mruthulellaru Kadaboora – Mrogagaane (2) Kreesthu Vale – Thiri Lethuru Lethuvaa? Neevu Priyudaa (2) ||Meluko|| Arayanga – Parishuddhulu Murisedaru – Akshaya Dehulai (2) Paramandu – Prabhu Kreesthu Nirathamu – O Priyundaa (2) ||Meluko|| Karuna Leni – O Maranamaa Nirathamu Neeku Jayamagunaa (2) Marana Samhaa – Rundesu Thvaragaa – Raanaiyunnaadu (2) ||Meluko|| Maamsa Loka – Pishaachaadulu Himsa Paracha – Vijrumbinchina (2) Leshamainanu – Jadiyakumu Aashatho – Kaachukonumu (2) ||Meluko|| Paapamunu – Cheyakumaa Repakumaa – Daiva Kopamunu (2) Shaapamunu Thappukoni Shradhdhatho – Kaachukonumaa (2) ||Meluko||