మేలుకొని యిక లేచి - YouWorship
Melukoni Yika Lechi
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
మేలుకొని యిక లేచి యేసుని -మేలులన్ వేనోళ్ల బాడరే = బాలబాలికలారా చాలా పాడరే - వేలపాడరే ||మేలు|| 1. పక్షి గణములు కూడి దేవుని - ప్రేమ నెల్లను పొగడుచున్నవి = బాపహరుడగు క్రీస్తు చెంతకు - పారుమా - రక్షణ కోరుమా ||మేలు|| 2. _అరుణరాగము వెల్లి విరిసెను - ఆకసంబున - జుక్కలణగెను = తరుణ ముననే లేచి దేవుని కెజగుమా - దీవెన కరుగుమా ||మేలు|| 3. _ తెల్లవారెను లోకమెల్లను - తెలివిగొని మున్ముందు దేవుని = తల్లి దండ్రియు - గురుడవీవని దలచుచూ - తగధ్యానించుమా ||మేలు|| 4. జగములెల్లను జంతుజాలము - ల గణితంబగు జీవులెల్లను = సొగసున న్వేనోళ్ల బొగడుట జూడుమా - నీవును పాడుమా ||మేలు|| 5. _ నీతి భాస్మరుడుదయమాయెను - నూతనోజ్జీవన మొసంగను = సతత మాతని దాపున న్వసియించుమా - తగ జీవించుమా ||మేలు|| - చెట్టి భానుమూర్తి Melukoni Yika Lechi Yesuni -Melulan Venolla Baadare = Baalabaalikalaaraa Chaalaa Paadare - Velapaadare ||Melu|| 1. Pakshi Ganamulu Koodi Devuni - Prema Nellanu Pogaduchunnavi = Baapaharudagu Kreesthu Chenthaku - Paarumaa - Rakshana Korumaa ||Melu|| 2. _Arunaraagamu Velli Virisenu - Aakasambuna - Jukkalanagenu = Tharuna Munane Lechi Devuni Kejagumaa - Deevena Karugumaa ||Melu|| 3. _ Thellavaarenu Lokamellanu - Thelivigoni Munmundu Devuni = Thalli Dandriyu - Gurudaveevani Dalachuchoo - Thagadhyaaninchumaa ||Melu|| 4. Jagamulellanu Janthujaalamu - La Ganithambagu Jeevulellanu = Sogasuna Nvenolla Bogaduta Joodumaa - Neevunu Paadumaa ||Melu|| 5. _ Neethi Bhaasmarududayamaayenu - Noothanojjeevana Mosangganu = Sathatha Maathani Daapuna Nvasiyinchumaa - Thaga Jeevinchumaa ||Melu|| - Chetti Bhaanumoorthi