మేలుకొనరే మా మనంబుల - YouWorship
Melukonare Maa Manambula
Artist: మిక్కిలి సమూయేలు
Category: Praise & Worship
Song Lyrics
మేలుకొనరే మా మనంబుల - మేలిమిగ మా మేర దప్పక పాలుమాలక లేచి దేవుని - పాదములు పూజింప గ్రక్కున ||మేలుకొనరే|| 1. దిక్కులెల్లను దేజరిల్లెను - దినకరుం డుదయింపనయ్యెను మొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు - మూల కర్తకు గొలువసేయంగ ||మేలుకొనరే|| 2. పక్షులెల్లను గిలకిలంచును - ప్రభుని మహిమలు బల్మం బాడెదను రక్షకుని సకలోపకృతులను - రమ్యముగ నుతియించి పాడంగ ||మేలుకొనరే|| 3. నిదుర బోయిన వేళ మిమ్మొక - నిమిషమైనను బాసియుండక పదిలముగ రక్షించు దేవుని - ప్రస్తుతింప మహాముదంబున ||మేలుకొనరే|| 4. మేటియౌ హృదయాబ్దములలో - మా కృతజ్ఞతా భూషణంబులు నేటుగా ధరియించుకొని యిటు - నిర్మలాత్మునిం బూజసేయంగ ||మేలుకొనరే|| 5. తెల్లవారంగం దెలియరే యిది - తెలివిగల మానవ సమాజము యుల్లసిల్లుచు నీతి భాస్కరుం - డుదయ మయ్యెను హృదయముల పై ||మేలుకొనరే|| Melukonare Maa Manambula - Melimiga Maa Mera Dappaka Paalumaalaka Lechi Devuni - Paadamulu Poojimpa Grakkuna ||Melukonare|| 1. Dikkulellanu Dejarillenu - Dinakarum Dudayimpanayyenu Mokkulaku Prathiphalamu Nichchedu - Moola Karthaku Goluvaseyamga ||Melukonare|| 2. Pakshulellanu Gilakilamchunu - Prabhuni Mahimalu Balmam Baadedanu Rakshakuni Sakalopakruthulanu - Ramyamuga Nuthiyimchi Paadamga ||Melukonare|| 3. Nidura Boyina Vela Mimmoka - Nimishamainanu Baasiyumdaka Padilamuga Rakshimchu Devuni - Prasthuthimpa Mahaamudambuna ||Melukonare|| 4. Metiyau Hrudayaabdamulalo - Maa Kruthagnathaa Bhooshanambulu Netugaa Dhariyimchukoni Yitu - Nirmalaathmunim Boojaseyamga ||Melukonare|| 5. Thellavaaramgam Deliyare Yidi - Thelivigala Maanava Samaajamu Yullasilluchu Neethi Bhaaskarum - Dudaya Mayyenu Hrudayamula Pai ||Melukonare||