మేము వెళ్లిచూచినాము - YouWorship
Memu Vellichoochinaamu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
మేము వెళ్లిచూచినాము - స్వామి యేసుక్రీస్తును = ప్రేమ మొక్కి వచ్చినాము మా మనంబులలరగ ||మేము|| 1. బేదలేము పురములోన - బీద కన్యమరియకుం = బేదగా సురూపుం దాల్చి వెలసెం బశులపాకలో ||మేము|| 2. జ్ఞానులమని గర్వపడక - దీనులమై నిత్యము = వాని ప్రేమ సకల ప్రజకు మానక ప్రకటింతము ||మేము|| 3. తద్దరిశనమందు మాకుం - బెద్ద మేలు గలిగెగా = హద్దులేని పాపమంత రద్దుపరచబడెనుగా ||మేము|| 4. మరణమెపుడొ రేపొమాపో - మరియెపుడో మన మెరుగము = త్వరగా పోయి పరమగురుని - దరిశనంబుం జేతము ||మేము|| 5. పరిశుద్ధాత్మ జన్మ మాకు - వరముగా నొసంగెను = పరమపురము మాకు హక్కు పంచెదాను నిరతము ||మేము|| 6. మాకు సర్వగర్వమణిగి - మంచి మార్గమబ్బెను = మాకు నీ సువార్తం జెప్ప మక్షువెంతోం గలిగెను ||మేము|| Memu Vellichoochinaamu - Svaami Yesukreesthunu = Prema Mokki Vachchinaamu Maa Manambulalaraga ||Memu|| 1. Bedalemu Puramulona - Beeda Kanyamariyakun = Bedagaa Suroopun Daalchi Velasen Bashulapaakalo ||Memu|| 2. Gnaanulamani Garvapadaka - Deenulamai Nithyamu = Vaani Prema Sakala Prajaku Maanaka Prakatinthamu ||Memu|| 3. Thaddarishanamandu Maakun - Bedda Melu Galigegaa = Hadduleni Paapamantha Radduparachabadenugaa ||Memu|| 4. Maranamepudo Repomaapo - Mariyepudo Mana Merugamu = Thvaragaa Poyi Paramaguruni - Darishanambun Jethamu ||Memu|| 5. Parishuddhaathma Janma Maaku - Varamugaa Nosanggenu = Paramapuramu Maaku Hakku Panchedaanu Nirathamu ||Memu|| 6. Maaku Sarvagarvamanigi - Manchi Maargamabbenu = Maaku Nee Suvaarthan Jeppa Makshuventhon Galigenu ||Memu||