మేం క్రైస్తవులం - YouWorship
Mem Kraisthavulam
Artist: స్వప్న ఎడ్వర్డ్స్
Category: Praise
Song Lyrics
ప్రేమ క్షమలను సమపాళ్లుగా విశ్వాసమే లక్ష్యంగా మా జీవితాలనే సాక్ష్యంగా నిజదేవుని జనాంగంగా (2) పిలువబడిన వారమే మేము సిగ్గుపడని వారమే మేము (2) మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం మేం క్రైస్తవులం పరలోక దీపికలం మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం మేం క్రైస్తవులం క్రైస్తవులం మేం క్రైస్తవులం క్రైస్తవులం మతానికి అతీతులం జాతి వర్ణ వర్గాలనేకం మేం యేసు రక్తంతో కొనబడిన వారం మేం సత్యమార్గంలో నడిచే వారం (2) యేసు నీ జీవితమే మాకు పాఠంగా మా బ్రతుకులకే ఒక యాగంగా చేసుకొన్న వారమే మేము ఏక శరీరమై ఉన్నాము (2) ||ప్రేమ|| మనుష్యులను ప్రేమిస్తాము దైవ ప్రేమనే ప్రకటిస్తాము ఏ శోధనకైనా తలవంచని వారం దేవుని చెంత మోకరించే వారం (2) లోకం మమ్ములను వేధిస్తున్నా చులకనగా చూసి నిందిస్తున్నా బాధను సహించే వారం మేం శత్రువునైనా క్షమిస్తాము (2) పాపం అంటే శరీరంతో చేసేదే కాదు మనసులో తలంచేది అంటాం ఎందుకంటే మేం క్రైస్తవులం ఏ మనిషి దేవుని రూపాన్ని చూడలేదు అందుకే విగ్రహారాధన మేం చెయ్యం ఎందుకంటే మేం క్రైస్తవులం దేవుడంటే సృష్టిని చేసిన వాడు ఆ దేవునికి విదేశీ దేవుడనే మాటే లేదంటాం ఎందుకంటే మేం క్రైస్తవులం ఎన్ని బాధలు పెట్టి హింసించినా ప్రేమతో క్షమిస్తాము ఎందుకంటే మేం క్రైస్తవులం ||ప్రేమ|| Prema Kshamalanu Samapaallugaa Vishwaasame Lakshyamgaa Maa Jeevithaalane Saakshyamgaa Nija Devun Janaangamgaa (2) Piluvanadina Vaarame Memu Siggupadani Vaarame Memu (2) Mem Kraisthavulam Kreesthanucharulam Mem Kraisthavulam Premaku Gnaapikalam Mem Kraisthavulam Paraloka Deepikalam Mem Kraisthavulam Baadhyatha Gala Pourulam Mem Kraisthavulam Kraisthavulam Mem Kraisthavulam Kraisthavulam Mathaaniki Atheethulam Jaathi Varna Vargaalanekam Mem Yesu Rakthamtho Konabadina Vaaram Mem Sathya Maargamlo Nadiche Vaaram (2) Yesu Nee Jeevithame Maaku Paatamgaa Maa Brathukulake Oka Yaagamgaa Chesukunna Vaarame Memu Eka Shareeramai Unnaamu (2) ||Prema|| Manushyulanu Premisthaamu Daiva Premane Prakatisthaamu Ae Shodhanakainaa Thalavanchani Vaaram Devuni Chentha Mokarinche Vaaram (2) Lokam Mammulanu Vedhisthunnaa Chulakanagaa Choosi Nindisthunnaa Baadhanu Sahinche Vaaram Mem Shathruvunainaa Kshamisthaamu (2) Paapam Ante Shareeramtho Chesede Kaadu Manasulo Thalanchedi Antaam Endukante Mem Kraisthavulam Ae Manishi Devuni Roopaanni Choodaledu Anduke Vigrahaaraadhana Mem Cheyyam Endukante Mem Kraisthavulam Devudante Srushtini Chesina Vaadu Aa Devuniki Videshi Devudane Maate Ledantaam Endukante Mem Kraisthavulam Enni Baadhalu Petti Himsinchinaa Prematho Kshamisthaamu Endukante Mem Kraisthavulam ||Prema||