మెల్లని చల్లని - YouWorship
Mellani Challani
Artist: ఎం ఎస్ శాంతవర్ధన్
Category: Gospel
Song Lyrics
మెల్లని చల్లని స్వరము యేసయ్యదే ఉల్లమంతటిని నింపు ఆనందము అల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్ ||మెల్లని|| శూన్యము నుండి సర్వం – సృష్టి చేసెనుగా మంచిదంతటిని మాటతో చేసెను పాపులను పిలిచిన ప్రేమ గల స్వరము పావనపరచెడి పరిశుద్ధుని స్వరము ||మెల్లని|| స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున దీనులను ఆదరించు దివ్య కరుణ స్వరం కుళ్ళిన శవమునందు జీవమును పోసెను పునరుత్తాన బలం కలదు ఆ స్వరములో ||మెల్లని|| గాలి తుఫానులన్ అణచిన స్వరమది భీతి భయములన్ని బాపెడి స్వరమది అంత్య దినమందున మృతుల లేపునుగా అందరికి తీర్పును తీర్చి పాలించును ||మెల్లని|| మహిమ గల ఆ స్వరం పిలుచుచుండె నిన్ను మహిమ నాథుండేసు కోరుచుండె నిన్ను మహిమ గల ఆ స్వరం వినెడి చెవులున్నావా మహిమ నాథుండేసున్ కోరు హృది ఉన్నదా ||మెల్లని|| Mellani Challani Swaramu Yesayyade Ullamanthatini Nimpu Aanandamu Allakallolamu Baapi Shaanthi Nichchun ||Mellani|| Shoonyamu Nundi Sarvam – Srushti Chesenugaa Manchidanthatini Maatatho Chesenu Paapulanu Pilichina Prema Gala Swaramu Paavanaparachedi Parishuddhuni Swaramu ||Mellani|| Swasthatha Shakthi Kaladu Prabhuni Swaramanduna Deenulanu Aadarinchu Divya Karuna Swaram Kullina Shavamunandu Jeevamunu Posenu Punarutthaana Balam Kaladu Aa Swaramulo ||Mellani|| Gaali Thuphaanulan Anachina Swaramadi Bheethi Bhayamulanni Baapedi Swaramadi Anthya Dinamanduna Mruthula Lepunugaa Andariki Theerpunu Theerchi Paalinchunu ||Mellani|| Mahima Gala Aa Swaram Piluchuchunde Ninnu Mahima Naathundesu Koruchunde Ninnu Mahima Gala Aa Swaram Vinedi Chevulunnavaa Mahima Naathundesun Koru Hrudi Unnadaa ||Mellani||