మీరే లోకమునకు వెలుగు - YouWorship
Meere Lokamunaku Velugu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: మీరే (2) లోకమునకు వెలుగు - లోకమునకు ఉప్పు మీరే (1) 1. మనుజులు మీదు మంచి క్రియలను - కని తండ్రిని మహిమ పరచగ (2) వినయమున మీ వెలుగు వారికి - కనబడగా ప్రకాశించుడి (2) 2. కొండమీద నుండు పట్టణము - ఉండనేరదు మరుగైనిజముగ దండిగ మనదు తండ్రి స్వరూపము - ఉండగ మీలో ప్రకాశించుడి 3. దేవుని వాక్యము వెలుగై యున్నది - జీవించుడి వెలుగును కలిగి పావనమగు సహవాసము కలిగి - దేవుని ఆత్మలో నిండి వర్థిల్లెడు 4. మరణచ్చాయలో మీరుండగ - పరమ వెలుగు ప్రకాశించెను పరిగిడె చీకటి వెలుగుదయించగ - పరిశుద్దాత్మ ఫలములు పొందిన 5. మీరికమీదట పరదేశులును - పరజనులుగ నుండక యుందురు పరిశుద్దులతో నేకపౌరులై - దేవుని గృహమునై యున్న 6. రాత్రి పగలు భేదము లేక - చంద్రుని సూర్యుని కాంతియు లేక ప్రభువగు దేవుడు ప్రకాశించును - యుగయుగముల కాయన రాజ్యము 7. ప్రభువగు దేవుడే జీవమై యుండియు - ఉప్పుగా జేసెను మిమ్మును తనకై ఉప్పును బోలి సారము కలిగి - ప్రభుయేసునకే హల్లెల్లూయ పాడుడి Pallavi: Meere (2) Lokamunaku Velugu - Lokamunaku Uppu Meere (1) 1. Manujulu Meedu Manchi Kriyalanu - Kani Thandrini Mahima Parachaga (2) Vinayamuna Mee Velugu Vaariki - Kanabadagaa Prakaashinchudi (2) 2. Kondameeda Nundu Pattanamu - Undaneradu Marugainijamuga Dandiga Manadu Thandri Svaroopamu - Undaga Meelo Prakaashinchudi 3. Devuni Vaakyamu Velugai Yunnadi - Jeevinchudi Velugunu Kaligi Paavanamagu Sahavaasamu Kaligi - Devuni Aathmalo Nindi Varthilledu 4. Maranachchaayalo Meerundaga - Parama Velugu Prakaashinchenu Parigide Cheekati Velugudayinchaga - Parishuddaathma Phalamulu Pondina 5. Meerikameedata Paradeshulunu - Parajanuluga Nundaka Yunduru Parishuddulatho Nekapaurulai - Devuni Gruhamunai Yunna 6. Raathri Pagalu Bhedamu Leka - Chandruni Sooryuni Kaanthiyu Leka Prabhuvagu Devudu Prakaashinchunu - Yugayugamula Kaayana Raajyamu 7. Prabhuvagu Devude Jeevamai Yundiyu - Uppugaa Jesenu Mimmunu Thanakai Uppunu Boli Saaramu Kaligi - PrabhuYesunake Hallellooya Paadudi