మిమ్మును నింపె మేలులతోడ - YouWorship
Mimmunu Nimpe Melulathoda
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: మిమ్మును నింపె మేలులతోడ - అవియేపరలోక దీవెనలు (2) 1. ఆయన మందిరమందే మీకు (2) అధిక దీవెనలు దొరుకును ఎన్నో (2) తన మందిర సమృద్ధిని పొంది (2) - త్రాగుడి జీవజలములను (2) 2. మీ పాపములను పరిహరించును ప్రభు మీకు విమోచన తనయందే కలదు సత్యుని కృపామహదైశ్వర్యముతో - సంతోషించుడి మీరు 3. తన రక్తముతో విమోచించిన వారికి ప్రభువు యిచ్చును స్వాస్థ్యము తేజోవాసులు పరిశుద్ధులతో - పాలివారినిగా చేసె 4. ప్రభు యేసు నెందరు స్వీకరించెదరో నిత్యజీవమును స్వతంత్రించుకొని పరిశుద్ధాత్మ వరమునుపొంది - ఆత్మలో ఆనందించెదరు 5. మిమ్మును స్థిరులుగా చేయును ప్రభువు మునుపటికన్న హెచ్చుగా నిచ్చి మీతో నుండగోరెను నిత్యము - పొందుడి ప్రభు దీవెనలు 6. ఆయన కృపలో వర్థిల్లినచో అనుదినము ప్రభు మిము దీవించును తన కృప మిమ్ము ఆవరించును - ఆనందించుడి కృపతో 7. జయ జీవితమును కలిగినవారే తన స్వాస్థ్యమును మిగుల పొందెదరు విశ్వాసముతో విజయముపొంది - పాడుడి హల్లెలూయ ప్రభుకే Pallavi: Mimmunu Nimpe Melulathoda - Aviyeparaloka Deevenalu (2) 1. Aayana Mandiramande Meeku (2) Adhika Deevenalu Dorukunu Enno (2) Thana Mandira Samruddhini Pondi (2) - Thraagudi Jeevajalamulanu (2) 2. Mee Paapamulanu Pariharinchunu Prabhu Meeku Vimochana Thanayande Kaladu Sathyuni Krupamahadaishvaryamutho - Santhoshinchudi Meeru 3. Thana Rakthamutho Vimochinchina Vaariki Prabhuvu Yichchunu Svaasthyamu Thejovaasulu Parishuddhalatho - Paalivaarinigaa Chese 4. Prabhu Yesu Nendaru Sveekarinchedaro Nithyajeevamunu Svathanthrinchukoni Parishuddhathma Varamunupondi - Aathmalo Aanandinchedaru 5. Mimmunu Sthirulugaa Cheyunu Prabhuvu Munupatikanna Hechchugaa Nichchi Meetho Nundagorenu Nithyamu - Pondudi Prabhu Deevenalu 6. Aayana Krupalo Varthillinacho Anudinamu Prabhu Mimu Deevinchunu Thana Krupa Mimmu Aavarinchunu - Aanandinchudi Krupatho 7. Jaya Jeevithamunu Kaliginavaare Thana Svaasthyamunu Migula Pondedaru Vishvaasamutho Vijayamupondi - Paadudi Hallelooya Prabhuke