మా యేసు క్రీస్తు - YouWorship
Maa Yesu Kreesthu
Artist: సమూయేలు పాక్యనాధము
Category: Praise & Worship
Song Lyrics
మా యేసు క్రీస్తు నీవే - మహిమగల రాజవు నీవు నీవే తండ్రికి - నిత్యకుమారుడవు - ఓ క్రీస్తూ 1. భూనరులన్ రక్షింపం - బూనుకొనినప్పుడు దీన కన్యాగర్భముం దిరస్మరింపలేదుగా - ఓ క్రీస్తూ 2. విజయము మరణపు - వేదనపై నొందంగా విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ - ఓ క్రీస్తూ 3. నీవు తండ్రిదైనట్టి - నిత్య మహిమయందు దేవుని కుడివైపు దిరముగా గూర్చున్నావు - ఓ క్రీస్తూ 4. నీవు న్యాయాధిపతివై - నిశ్చయముగా వచ్చెదవు కావున నీ సాయంబు కానిమ్ము నీ దాసులకు - ఓ క్రీస్తూ 5. దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించిన సేవకులకై మేము చేయు మనవి నాలించు - ఓ క్రీస్తూ 6. నీ వారి నెల్లప్పుడును - నిత్య మహిమయందు నీ పరిశుద్ధులతోను వెంచుకొను మయ్య - ఓ క్రీస్తూ 7. నీదు జనము రక్షించి - నీ దాయము దీవించుము నాధా వారలను నేలి లేవనెత్తు మెప్పుడును - ఓ క్రీస్తూ 8. దిన దినమును నిన్ను - మహిమ పర్చుచున్నాము ఘనముగా నీ నామమున్ గొప్పచేయుచున్నాము - ఓ క్రీస్తూ 9. నేడు పాపము చేయకుండ - నెనరుతో మము గావుమయ్యా ప్రభూ నీ దాసులకు పరమ దయ నిమ్మయ్య - ఓ క్రీస్తూ 10. ప్రభువా కరుణించుము - ప్రభువా కరుణించుము ప్రార్థించు నీ దాసులపై దయలనిమ్ము దీవెనలక - ఓ క్రీస్తూ 11. నిన్ను నమ్మి యున్నాము - నీ కృప మా పైం జూపుము మేము మోసపోకుండ నీవే కాపాడు మయ్యా - ఓ క్రీస్తూ Maa Yesu Kreesthu Neeve - Mahimagala Raajavu Neevu Neeve Thamdriki - Nithyakumaarudavu - O Kreesthoo 1. Bhoonarulan Rakshimpam - Boonukoninappudu Deena Kanyaagarbhamum Dirasmarimpaledugaa - O Kreesthoo 2. Vijayamu Maranapu - Vedanapai Nomdamgaa Vishvaasulamdarikin Vippithivi Mokshamun - O Kreesthoo 3. Neevu Thamdridainatti - Nithya Mahimayamdu Devuni Kudivaipu Diramugaa Goorchunnaavu - O Kreesthoo 4. Neevu Nyaayaadhipathivai - Nishchayamugaa Vachchedavu Kaavuna Nee Saayambu Kaanimmu Nee Daasulaku - O Kreesthoo 5. Divyamau Rakthambu Chimdimchi Neevu Rakshimchina Sevakulakai Memu Cheyu Manavi Naalimchu - O Kreesthoo 6. Nee Vaari Nellappudunu - Nithya Mahimayamdu Nee Parishuddhulathonu Vemchukonu Mayya - O Kreesthoo 7. Needu Janamu Rakshimchi - Nee Daayamu Deevimchumu Naadhaa Vaaralanu Neli Levaneththu Meppudunu - O Kreesthoo 8. Dina Dinamunu Ninnu - Mahima Parchuchunnaamu Ghanamugaa Nee Naamamun Goppacheyuchunnaamu - O Kreesthoo 9. Nedu Paapamu Cheyakumda - Nenarutho Mamu Gaavumayyaa Prabhoo Nee Daasulaku Parama Daya Nimmayya - O Kreesthoo 10. Prabhuvaa Karunimchumu - Prabhuvaa Karunimchumu Praarthimchu Nee Daasulapai Dayalanimmu Deevenalaka - O Kreesthoo 11. Ninnu Nammi Yunnaamu - Nee Krupa Maa Paim Joopumu Memu Mosapokumda Neeve Kaapaadu Mayyaa - O Kreesthoo