మా మొర నాలకించుము మహారాజ యేసు ప్రభువా - YouWorship
Maa Mora Naalakinchumu Mahaaraaja Yesu Prabhuvaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మా మొర నాలకించుము - మహారాజ యేసు ప్రభువా (1) కోపముతో నను జూడకుము (1)- కనికరమున పలుకుము (2) 1. నిన్నెట్లు విడనాడెదను - ప్రాణప్రియుడా నా యేసు (2) సిలువకు జడియలేదు - శ్రమలకు బెదురలేదు (2) నీ నోట దూషణమాట (2) - ఒకటైనను రాలేదు (2) 2. పరలోకమును విడచితివి - పాపులకై ఏతెంచితివి సర్వలోక రక్షణకై సిలువపై శ్రమనొందితివి ఇట్టి నీ ప్రేమకు నేను - ఎట్టి ధనమియ్యగలను 3. సమస్త లోకమునకు - నీ రక్తము నిచ్చితివి మూయబడిన యీ తలుపు - తీయబడెను నీ వలన నే నేల నీ సంస్తుతిని - నిరతంబు చేయకపోతి 4. జగమంత నీ రాకడను - నిరీక్షించుచుండెను నీ నీతిని నెరవేర్చుటకు - ఖ్యాతిగ నరుదెంచితివి నిబంధన ననుసరించి - విముక్తిని మా కొసగితివి 5. రక్షకుండా పాపులను - శిక్షించక రక్షించు నిత్యజీవము నిమ్ము - ఆత్మయందు దీనులకు దైవ కుమారా యేసు - సార్వత్రిక నివాసీ Pallavi: Maa Mora Naalakinchumu - Mahaaraaja Yesu Prabhuvaa (1) Kopamutho Nanu Joodakumu (1)- Kanikaramuna Palukumu (2) 1. Ninnetlu Vidanaadedanu - Praanapriyudaa Naa Yesu (2) Siluvaku Jadiyaledu - Shramalaku Beduraledu (2) Nee Nota Dooshanamaata (2) - Okatainanu Raaledu (2) 2. Paralokamunu Vidachithivi - Paapulakai Ethenchithivi Sarvaloka Rakshanakai Siluvapai Shramanondithivi Itti Nee Premaku Nenu - Etti Dhanamiyyagalanu 3. Samastha Lokamunaku - Nee Rakthamu Nichchithivi Mooyabadina Yee Thalupu - Theeyabadenu Nee Valana Ne Nela Nee SanSthuthini - Nirathambu Cheyakapothi 4. Jagamantha Nee Raakadanu - Nireekshinchuchundenu Nee Neethini Neraverchutaku - Khyaathiga Narudenchithivi Nibandhana Nanusarinchi - Vimukthini Maa Kosagithivi 5. Rakshakundaa Paapulanu - Shikshinchaka Rakshinchu Nithyajeevamu Nimmu - Aathmayandu Deenulaku Daiva Kumaaraa Yesu - Saarvathrika Nivaasee