మా దేవ మా దేవ నీదు విశ్వాస్యత చాల గొప్పది - YouWorship
Maa Deva Maa Deva Needu Vishvaasyatha Chaala Goppadi
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: మా దేవ మా దేవ నీదు - విశ్వాస్యత చాల గొప్పది (2) - మా దేవ (1) 1. దయామయుండగు తండ్రివి నీవే - తల్లిని మించిన దాతవు నీవే (2) మాయా మమతల గాధలనుండి -మమ్ములను రక్షించితివి (2) 2. కోడిపిల్లలను కాసెడు పగిది - ఆపదలన్నింటి బాపితివయ్యా సర్వకాలముల యందున నీకే -చక్కగ సంస్తుతులగు నీకే 3. సింహపు పిల్లలు ఆకలి గొనిన - సింహపు గుహలో నను వేసినను సిగ్గు కలుగకుండగ నను నీవు -గాపాడుచున్నా వీ యిలలో 4. మరణ లోయలందున నేనున్న -తరుణములు నాకు విరోధమైన చరణముల్ పాడెడు విధమున నీవు -నన్నొనర్చుచున్నావుగా 5. వ్యాధులు నన్ను బాధించినను-వ్యాకులములు హృదయములో నున్న వదలవు నన్నిల అనాథునిగ నెప్పుడు -నను బ్రోచుచు నుందువుగా 6. నీదు సత్యమాకాశము కంటె -అత్యున్నతముగ స్థాపించబడె నీదు సత్యమును నీచుడనగు నా - కనులకు ప్రత్యక్షపరచితివి 7. పర్వతంబులు తొలగినగాని -పలువిధ కొండలు తత్తరిల్లినను పావనుడా నీదు వెల లేనియట్టి కృప - నను విడువదు హల్లెలూయా Pallavi: Maa Deva Maa Deva Needu - Vishvaasyatha Chaala Goppadi (2) - Maa Deva (1) 1. Dayaamayundagu Thandrivi Neeve - Thallini Minchina Daathavu Neeve (2) Maayaa Mamathala Gaadhalanundi -Mammulanu Rakshinchithivi (2) 2. Kodipillalanu Kaasedu Pagidi - Aapadalanninti Baapithivayyaa Sarvakaalamula Yanduna Neeke -Chakkaga Sansthuthulagu Neeke 3. Sinhapu Pillalu Aakali Gonina - Sinhapu Guhalo Nanu Vesinanu Siggu Kalugakundaga Nanu Neevu -Gaapaaduchunnaa Vee Yilalo 4. Marana Loyalanduna Nenunna -Tharunamulu Naaku Virodhamaina Charanamul Paadedu Vidhamuna Neevu -Nannonarchuchunnaavugaa 5. Vyaadhulu Nannu Baadhinchinanu-Vyaakulamulu Hrudayamulo Nunna Vadalavu Nannila Anaathuniga Neppudu -Nanu Brochuchu Nunduvugaa 6. Needu Sathyamaakaashamu Kante -Athyunnathamuga Sthaapinchabade Needu Sathyamunu Neechudanagu Naa - Kanulaku Prathyakshaparachithivi 7. Parvathambulu Tholaginagaani -Paluvidha Kondalu Thaththarillinanu Paavanudaa Needu Vela Leniyatti Krupa - Nanu Viduvadu Hallelooyaa