మార్గము చూపుము ఇంటికి - YouWorship
Maargamu Choopumu Intiki
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2) పాప మమతల చేత – పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము (2) ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము (2) ||మార్గము|| ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ దేహీ నిను చేరితి (2) దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు దారిని జూపుము (2) ||మార్గము|| దూర దేశములోన – బాగుందుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల తరిమే దారిద్య్రము (2) దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి ధన్యుని చేయుము (2) ||మార్గము|| అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు ఆకలి బాధలో అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ అలవడెను వేదన (2) అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము (2) ||మార్గము|| కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి కూలివానిగనైన – నీ యింట పని చేసి కనికరమే కోరుదు (2) కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము (2) ||మార్గము|| నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను (2) నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును (2) ||మార్గము|| Maargamu Choopumu Intiki – Naa Thandri Intiki Maadhurya Premaa Prapanchamo – Choopinchu Kantiki (2) Paapa Mamathala Chetha – Paaripoyina Naaku Praapthinche Kshaamamu Paschaaththappamunondi – Thandri Kshama Koruchu Pampumu Kshemamu (2) Prabhu Needu Siluva – Mukhamu Chellani Naaku Puttinche Dhairyamu (2) ||Maargamu|| Dhaname Sarvambanuchu – Sukhame Swargambanuchu Thandrini Veedithi Dharani Bhogamulella – Brathuku Dhwamsamu Jeya Dehi Ninu Cherithi (2) Dehi Ani Nee Vaipu – Chethuletthina Naaku Daarini Joopumu (2) ||Maargamu|| Doora Deshamulona – Baagundunanukonuchu Thappithi Maargamu Tharalipoyiri Nenu – Nammina Hithulella Tharime Daridryamu (2) Daakshinya Moorthy Nee – Daya Naapai Kuripinchi Dhanyuni Cheyumu (2) ||Maargamu|| Ammukontini Nenu – Adhamudokaniki Naadu Aakali Baadhalo Anyaayamayipoye – Pandulu Saha Veliveya Alavadenu Vedana (2) Adugante Avineethi – Melkoniye Maanavatha Aashrayamu Goorchumu (2) ||Maargamu|| Kodukune Kaadanuchu – Gruhame Cherasaalanuchu Kopinchi Vellithi Koolivaaniganaina – Nee Yinta Pani Chesi Kanikarame Korudu (2) Kaadanaku Naa Thandri – Dikkevvarunu Leru Kshamiyinchi Brovumu (2) ||Maargamu|| Naa Thandri Nanu Joochi – Parugidichoo Ethenchi Naapaibadi Edchenu Nava Jeevamunu Goorchi – Intiki Thodkoni Velli Nannoo Deevinchenu (2) Naa Jeevitha Kathayantha – Yesu Premaku Dharalo Saakshyamai Yundunu (2) ||Maargamu||