మారు మనస్సు పొందుము - YouWorship
Maaru Manassu Pondumu
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: మారు మనస్సు పొందుము (2)- ప్రభుని రాజ్యము సమీపించెను (2) 1. యెహోవా దేవుని రాజ్యము - మహోన్నతమై వ్యాపించెను (2) తన రాజ్యప్రభావమున్ తన ప్రజలు (2) తన శౌర్యమునెంతో చాటెదరు (2) 2. ఆయన రాజ్యము శాశ్వతము - ఆత్మలో దీనులగువారు ఆ రాజ్య నివాసులగుదురు - ఆయనకే మా వందన స్తుతులు 3. నూతన జన్మానుభవము ద్వారా చూతురు ఆ రాజ్యంబును ఆత్మ జన్మమును గలవారై - ఆ రాజ్యములోన చేరెదరు 4. రక్తమాంసంబులు దానిని - స్వతంత్రించు కొనజాలవు స్వాస్థ్యం పాపులకసలే లేదు - దుష్టులకందులో భాగములేదు 5. అంధకార రాజ్యమునుండి - పొందుగా తన రాజ్యంబునకు ప్రభుదెచ్చె ప్రియమారగ మనల - ప్రశంస స్తుతి చెల్లించెదము Pallavi: Maaru Manassu Pondumu (2)- Prabhuni Raajyamu Sameepinchenu (2) 1. Yehovaa Devuni Raajyamu - Mahonnathamai Vyaapinchenu (2) Thana Raajyaprabhaavamun Thana Prajalu (2) Thana Shauryamunentho Chaatedaru (2) 2. Aayana Raajyamu Shaashvathamu - Aathmalo Deenulaguvaaru Aa Raajya Nivaasulaguduru - Aayanake Maa Vandana Sthuthulu 3. Noothana Janmaanubhavamu Dvaaraa Choothuru Aa Raajyambunu Aathma Janmamunu Galavaarai - Aa Raajyamulona Cheredaru 4. Rakthamaansambulu Daanini - Svathanthrinchu Konajaalavu Svaasthyan Paapulakasale Ledu - Dushtulakandulo Bhaagamuledu 5. Andhakaara Raajyamunundi - Pondugaa Thana Raajyambunaku Prabhudechche Priyamaaraga Manala - Prashansa Sthuthi Chellinchedamu