మాయ లోకము మోసపోకుము యేసునందే రక్షణ దొరుకును నీకు - YouWorship
Maaya Lokamu Mosapokumu Yesunande Rakshana Dorukunu Neeku
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: మాయ లోకము - మోసపోకుము -యేసునందే రక్షణ దొరుకును నీకు (2) 1. బంధుమిత్రులు - భార్య బిడ్డలు (2) -ధనము ఘనము అందచందము (2) అవి అన్నియును - నీటిబుడగలె (2) - సమాధితోనే - సమాప్తమౌను (2) 2. పడగ విప్పిన పామువలె నీ - పాపము నిన్ను వెంబడించును పాప ఫలితము మరణమేగదా - దాని అంతము నిత్యనరకము 3. నిన్ను రక్షింపనెంచి ప్రభువు - పరమును విడచి ధరకు వచ్చెను నీకు బదులుగా శ్రమల నోర్చెను -సిలువలోనే బలియాయె నేసు 4. ఇప్పుడైనను ఒప్పుకొనుమిక - నీ పాపజీవితము నంతయు నిన్ను క్షమించును కృపతో ప్రభువు - ఇదియే నీ రక్షణ దినముగా 5. దేహమంత ప్రభు గాయముల్ పొందె - పరిశుద్ధ రక్తమును కార్చెను నిత్యజీవము నీకు నీయను - మృతిని గెల్చి తిరిగి లేచెను Pallavi: Maaya Lokamu - Mosapokumu -Yesunande Rakshana Dorukunu Neeku (2) 1. Bandhumithrulu - Bhaarya Biddalu (2) -Dhanamu Ghanamu Andachandamu (2) Avi Anniyunu - Neetibudagale (2) - Samaadhithone - Samaapthamaunu (2) 2. Padaga Vippina Paamuvale Nee - Paapamu Ninnu Vembadinchunu Paapa Phalithamu Maranamegadaa - Daani Anthamu Nithyanarakamu 3. Ninnu Rakshimpanenchi Prabhuvu - Paramunu Vidachi Dharaku Vachchenu Neeku Badulugaa Shramala Norchenu -Siluvalone Baliyaaye Nesu 4. Ippudainanu Oppukonumika - Nee Paapajeevithamu Nanthayu Ninnu Kshaminchunu Krupatho Prabhuvu - Idiye Nee Rakshana Dinamugaa 5. Dehamantha Prabhu Gaayamul Ponde - Parishuddha Rakthamunu Kaarchenu Nithyajeevamu Neeku Neeyanu - Mruthini Gelchi Thirigi Lechenu