మానవుడవై సకల - YouWorship
Maanavudavai Sakala
Artist: మార్తాండ జ్ఞానప్రకాశము
Category: Repentance
Song Lyrics
మానవుడవై సకల నరుల మానక నా దోషముల బాపుటకు బలియైతివే యేసు – (2) బహు ప్రేమ తోడ ||మానవుడవై|| నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య ప్రేమ నొందుటకు – (2) నియమంబు నిచ్చి ||మానవుడవై|| నీ శరీరము రొట్టె వలెనె నిజముగా విరువంగబడెనే నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే – (2) నా యన్న యేసు ||మానవుడవై|| మంచి యూట మించి దండి పంచ గాయములలో నుండి నిత్య జీవపు టూటలు జేసితి – (2) నీ ప్రేమ నుండి ||మానవుడవై|| నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు నీదు ప్రేమ బలిలో మనుటకు నిత్య మాచరించుడంటివి నీ – (2) నిజ భక్తి తోడ ||మానవుడవై|| ఎంతో ప్రేమతో బలిగానయితివి యెంతో ప్రేమాచారమైతివి చింతలును నా పాపములు బాప – (2) శ్రీ యేసు దేవా ||మానవుడవై|| నిత్య బలియగు నిన్నే నమ్మి నిన్ను ననుభవించి నెమ్మి నిన్ను నిముడించుకొని నాలో నీ – (2) నిజ రూప మొంద ||మానవుడవై|| నేను నీ బలిలోన గలిసి నేను నీతో గలిసి మెలిసి నేను నీవలె నుండి జేసితివే – (2) నా దివ్య యేసు ||మానవుడవై|| నీదు శ్రమలను బలిని నిపుడు నాదు కనులు చూడ నెపుడు నాదు పాప భారములు దిగునే – (2) నా దివ్య యేసు ||మానవుడవై|| నీవు బలియై తిరిగి లేచి నిత్య తేజోరూపు దాల్చి నిత్యమును నా బంతి నున్నావే – (2) నిజ దేవా యేసు ||మానవుడవై|| నీవే నీ చేతులలో నిత్తువు ఈ నీ బలి విందునకు వత్తువు నిన్ను నిట జూచితిని నా యేసు – (2) ఎన్నడును మరువను ||మానవుడవై|| Maanavudavai Sakala Narula Maanaka Naa Doshamula Baaputaku Baliyaithive Yesu – (2) Bahu Prema Thoda ||Maanavudavai|| Needu Balini Nithyamuganu Nijamugaa Dhyaaninchi Premanu Needu Divya Prema Nondutaku – (2) Niyamambu Nichchi ||Maanavudavai|| Nee Shareeramu Rotte Valene Nijamugaa Viruvangabadene Ninnu Dinu Bhaagyambu Nichchithive – (2) Naa Yanna Yesu ||Maanavudavai|| Manchi Yoota Minchi Dhandi Pancha Gaayamulalo Nundi Nithya Jeevapu Tootalu Jesithi – (2) Nee Prema Nundi ||Maanavudavai|| Ninnu Gnaapaka Munchukonutaku Needu Prema Balilo Manutaku Nithya Maacharinchudantivi Nee – (2) Nija Bhakthi Thoda ||Maanavudavai|| Entho Prematho Baligaanaithivi Yentho Premaachaaramaithivi Chinthalunu Naa Paapamulu Baapa – (2) Shree Yesu Devaa ||Maanavudavai|| Nithya Baliyagu Ninne Nammi Ninnu Nanubhavinchi Nemmi Ninnu Nimudinchukoni Naalo Nee – (2) Nija Roopa Monda ||Maanavudavai|| Nenu Nee Balilona Galisi Nenu Neetho Galisi Melisi Nenu Neevale Nunda Jesithive – (2) Naa Divya Yesu ||Maanavudavai|| Needu Shramalnu Balini Nipudu Naadu Kanulu Chooda Nepudu Naadu Paapa Bhaaramulu Digune – (2) Naa Divya Yesu ||Maanavudavai|| Neevu Baliyai Thirigi Lechi Nithya Thejoroopu Daalchi Nithyamunu Naa Banthi Nunnaave – (2) Nija Devaa Yesu ||Maanavudavai|| Neeve Nee Chethulalo Nitthuvu Ee Nee Bali Vindunaku Vatthuvu Ninnu Nita Joochithini Naa Yesu – (2) Yennadunu Maruvanu ||Maanavudavai||