మాట్లాడే యేసయ్యా - YouWorship
Maatlaade Yesayyaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు (2) (నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2) చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4) ||మాట్లాడే|| వెన్నలాంటి కన్నులలో కురిసే తన ప్రేమను పంచాలని (3) వేకువనే తట్టుచున్నాడు కునుకని నిద్రపోని నా యేసయ్యా (2) తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2) ||మాట్లాడే|| అరుణోదయమున నేను లేచి కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3) ఉత్సాహగానముతో యేసయ్యను సంగీత స్వరములతో ఘనపరచెదను (2) ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు (2) ||మాట్లాడే|| లోకము నుండి నన్ను ప్రత్యేకించి మైమరిపించాడు మహనీయుడు (3) ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు జీవముగల సంఘములో నిలిపియున్నాడు (2) తన మాటతో నన్ను బలపరచాడు కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు (2) ||మాట్లాడే|| Maatlaade Yesayyaa Naatho Maatlaaduchunnaadu (2) (Nannu) Mokaalla Paina Aadinchuchu (2) Chanti Biddalaaga Kaayuchunnaadu (4) ||Maatlaade|| Vennalaanti Kannulalo Kurise Thana Premanu Panchaalani (3) Vekuvane Thattuchunnaadu Kunukani Nidraponi Naa Yesayyaa (2) Thallidandri Kanna Minna Aina Devudu Lokaana Naa Yesuku Saati Lerevvaru (2) ||Maatlaade|| Arunodayamuna Nenu Lechi Kruthagnathaa Sthuthulanu Chellinchedanu (3) Uthsaahagaanamutho Yesayyanu Sangeetha Swaramulatho Ghanaparachedanu (2) Prathi Kshanamu Nannu Nadipinche Devudu Prathi Udayam Thana Krupatho Nimpe Naa Devudu (2) ||Maatlaade|| Lokamu Nundi Nannu Prathyekinchi Maimaripinchaadu Mahaneeyudu (3) Upadeshamutho Nannu Nadupuchunnaadu Jeevamugala Sanghamulo Nilipiyunnaadu (2) Thana Maatatho Nannu Balaparachaadu Krupa Vembadi Krupatho Nanu Nimpuchunnaadu (2) ||Maatlaade||