మాకర్త గట్టి దుర్గము - YouWorship
Maakartha Gatti Durgamu
Artist: మార్టిన్ లూథర్
Category: Praise & Worship
Song Lyrics
1. మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు సంప్రాప్తమైన కష్టము లన్నిటిని నణంచు ఆ పాత శత్రు వెంతో క్రూరుండు తదాయుధము లుపాయ శక్తులు అతం డసమానుండు. 2. మేమో నశించిపోదుము మా శక్తి నిష్ఫలంబు మాకై ప్రభుని శూరుండు యుద్ధంబు చేసిపెట్టు అతం డెవ్వండు? యేసు క్రీస్తు మా రక్షకుండు మరొక్క డెవ్వడు? అతండే గెల్పుపొందు. 3. ప్రపంచ మంతటన్ గ్రమ్ము పిశాచు లేమి చేయు? మమ్మెల్ల మింగనున్నను మాకేల భీతివేయు? ఈ లోకాధిపుం దుగ్రుండైనను దానేమి చేయు? దీర్ఘుండె నతండు నశించు మాటలతోనే. 4. వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచ లేడు దైవాత్మ తోడగుం గదా తా నిన్న నేడు రేపు మా కుటుంబము మా కీర్తి, యాస్తి, ప్రాణంబు పోయినన్ నష్టంబు వానిదె రాజ్యంబు మాది యౌను. 1. Maakartha Gatti Durgamu Ne Nammu Aayudhambu Sampraapthamaina Kashtamu Lannitini Nanamchu Aa Paatha Shathru Vemtho Kroorumdu Thadaayudhamu Lupaaya Shakthulu Atham Dasamaanumdu. 2. Memo Nashimchipodumu Maa Shakthi Nishphalambu Maakai Prabhuni Shoorumdu Yuddhambu Chesipettu Atham Devvamdu? Yesu Kreesthu Maa Rakshakumdu Marokka Devvadu? Athamde Gelpupomdu. 3. Prapamcha Mamthatan Grammu Pishaachu Lemi Cheyu? Mammella Mimganunnanu Maakela Bheethiveyu? Ee Lokaadhipum Dugrumdainanu Daanemi Cheyu? Deerghumde Nathamdu Nashimchu Maatalathone. 4. Vaakyambu Nithyame Gadaa Virodhi Vamcha Ledu Daivaathma Thodagum Gadaa Thaa Ninna Nedu Repu Maa Kutumbamu Maa Keerthi, Yaasthi, Praanambu Poyinan Nashtambu Vaanide Raajyambu Maadi Yaunu.