మాకనుగ్రహించిన దైవ వాక్యములచే - YouWorship
Maakanugrahinchina Daiva Vaakyamulache
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మాకనుగ్రహించిన దైవ వాక్యములచే - మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా (2) అను పల్లవి: రక్షణ నొందిన వారికి దేవుడు (2)- ఒసగిన శక్తిని యెరిగి జీవింతుము (2) 1. రక్షణ కృపలు ప్రభువిచ్చినవే (1)- అతిశయింపలేము అంతయు కృపయే (2) అమూల్యమైన సిలువశక్తిచే (2) ఖాళీయైన మమ్మును నింపె (1) 2. పాప మృతులమైన మమ్మును లేపెను - ప్రేమతో మమ్ము ప్రభుతోనే లేపెను పరలోక పదవి పాపులకిచ్చె పునరుత్థాన శక్తిచే కలిగె 3. మరణ పునరుత్థాన మందైక్యతచే - బలాతిశయమున్ పొందెదము విశ్వసించు మనలో తన శక్తి యొక్క మితిలేని మహాత్మ్యము తెలిసికొనెదము 4. సర్వాధికారము ఆధిపత్యముల కంటె - శక్తి ప్రభుత్వము లన్నిటికంటే అన్ని నామములలో హెచ్చింపబడిన యుగ యుగములలో మేలైన నామమున 5. తనశక్తిని బయలుపరచుటకు - ఏర్పరచుకొనెను బలహీనులను ఎన్నికైన్వారిని వ్యర్థపరచుటకు నీచులైనవారిని ఏర్పరచుకొనెన్ 6. యుద్ధోపరణముల్ ఆత్మీయమైనవి - మానక ప్రభువు విధేయులమగుటే దుర్గములన్నిటిన్ పడగొట్టు నదియే ప్రభు యేసు వొసగిన భాగ్యము యిదియే Pallavi: Maakanugrahinchina Daiva Vaakyamulache - Maa Manonethramulu Veligimpumayyaa (2) Anu Pallavi: Rakshana Nondina Vaariki Devudu (2)- Osagina Shakthini Yerigi Jeevinthumu (2) 1. Rakshana Krupalu Prabhuvichchinave (1)- Athishayimpalemu Anthayu Krupaye (2) Amoolyamaina Siluvashakthiche (2) Khaaleeyaina Mammunu Nimpe (1) 2. Paapa Mruthulamaina Mammunu Lepenu - Prematho Mammu Prabhuthone Lepenu Paraloka Padavi Paapulakichche Punaruththaana Shakthiche Kalige 3. Marana Punaruththaana Mandaikyathache - Balaathishayamun Pondedamu Vishvasinchu Manalo Thana Shakthi Yokka Mithileni Mahaathmyamu Thelisikonedamu 4. Sarvaadhikaaramu Aadhipathyamula Kante - Shakthi Prabhuthvamu Lannitikante Anni Naamamulalo Hechchimpabadina Yuga Yugamulalo Melaina Naamamuna 5. Thanashakthini Bayaluparachutaku - Erparachukonenu Balaheenulanu Ennikainvaarini Vyarthaparachutaku Neechulainavaarini Erparachukonen 6. Yuddhoparanamul Aathmayamainavi - Maanaka Prabhuvu Vidheyulamagute Durgamulannitin Padagottu Nadiye Prabhu Yesu Vosagina Bhaagyamu Yidiye