మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు - YouWorship
Mahonnathuni Chaatuna Vasiyinchuvaade Dhanyundu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు (1) సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు (2) 1. ఆయనే నా కోట - ఆశ్రయము నే - నమ్ముకొను దేవుడు (2) రక్షించు వేటకాని ఉరి నుండి - పాడు తెగులు నుండి (2) 2. తన రెక్కలతో నిను కప్పును నీకు - ఆశ్రయంబగును ఆయన సత్యంబు నీ కేడెమును - డాలునై యున్నది 3. రే భయమునకైనా పగటిలో నెగురు - బాణమునకైనా చీకటిలో తిరుగు తెగులునకైనా - నీవు భయపడవు 4. మధ్యాహ్నములో పాడుచేయు - రోగమునకు భయపడవు నీ ప్రక్కను వేయి మంది పడినను - నీవు భయపడవు 5. నీ కుడిప్రక్కను పదివేల మంది - కూలిపోయినను అపాయము నీ దాపున కేమాత్రము - రాదు భయపడవు 6. భక్తిహీనులకు కల్గు ప్రతిఫలము - నీవు చూచెదవు మహోన్నతునే ఆశ్రయముగా చేసి - వసించు చున్నావు 7. నీ గుడారమున కపాయము తెగులు - సమీపించదు నీ మార్గంబులలో నిను కాపాడను - దూతలకు చెప్పున్ 8. నీ పాదములకు రాయి తగుల నీక - నిన్నెత్తు కొందురు సింహములను నాగుల భుజంగములను - అణగ ద్రొక్కెదవు 9. నన్నెరిగి ప్రేమించె గాన నేను - వాని ఘనపరతున్ నా నామమున మొఱ్ఱపెట్టగా నేను - ఉత్తరమిచ్చెదను 10. శ్రమలో తోడై విడిపించి వాని - గొప్ప చేసెదను దీర్ఘాయువుతో తృప్తిపరచి నా - రక్షణ చూపెదను Pallavi: Mahonnathuni Chaatuna Vasiyinchuvaade Dhanyundu (1) Sarvashakthuni Needanu Vishraminchu Vaade Dhanyundu (2) 1. Aayane Naa Kota - Aashrayamu Ne - Nammukonu Devudu (2) Rakshinchu Vetakaani Uri Nundi - Paadu Thegulu Nundi (2) 2. Thana Rekkalatho Ninu Kappunu Neeku - Aashrayambagunu Aayana Sathyambu Nee Kedemunu - Daalunai Yunnadi 3. Re Bhayamunakainaa Pagatilo Neguru - Baanamunakainaa Cheekatilo Thirugu Thegulunakainaa - Neevu Bhayapadavu 4. Madhyaahnamulo Paaducheyu - Rogamunaku Bhayapadavu Nee Prakkanu Veyi Mandi Padinanu - Neevu Bhayapadavu 5. Nee Kudiprakkanu Padivela Mandi - Koolipoyinanu Apaayamu Nee Daapuna Kemaathramu - Raadu Bhayapadavu 6. Bhakthiheenulaku Kalgu Prathiphalamu - Neevu Choochedavu Mahonnathune Aashrayamugaa Chesi - Vasinchu Chunnaavu 7. Nee Gudaaramuna Kapaayamu Thegulu - Sameepinchadu Nee Maargambulalo Ninu Kaapaadanu - Doothalaku Cheppun 8. Nee Paadamulaku Raayi Thagula Neeka - Ninneththu Konduru Sinhamulanu Naagula Bhujanggamulanu - Anaga Drokkedavu 9. Nannerigi Preminche Gaana Nenu - Vaani Ghanaparathun Naa Naamamuna Morrapettagaa Nenu - Uththaramichchedanu 10. Shramalo Thodai Vidipinchi Vaani - Goppa Chesedanu Deerghaayuvutho Thrupthiparachi Naa - Rakshana Choopedanu