మహిమ సర్వోన్నతమైన దైవమునకి - YouWorship
Mahima Sarvonnathamaina Daivamunaki
Artist: బేతాళ జాన్
Category: Praise
Song Lyrics
మహిమ సర్వోన్నతమైన దైవమునకి మహి సమాధానానుగ్రహము గలుగున్ ప్రభో ||మహిమ|| 1. నిన్ను స్తోత్రించుచు - నిన్ను పూజించుచు నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో ||మహిమ|| 2. ప్రభువైన దేవుండా - పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి పరిశుద్ధంబగు ప్రభో ||మహిమ|| 3. వినయంబుతో నీదు - ఘన మహిమార్థంబై వందనము లర్పించి వినుతింతుము సత్ప్రభో ||మహిమ|| 4. జనితైక పుత్రుడగు - ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల జనకుని కుమారుడ ప్రభో ||మహిమ|| 5. ధర పాపములమోయు - వరపుణ్య శీలుండా కరుణించి మా బీద మొరలాలించుము ప్రభో ||మహిమ|| 6. తండ్రియైన దేవుని - దక్షిణ భాగమున గూర్చుండి యున్నావు కృప జూపుమి సత్ప్రభో ||మహిమ|| 7. పరిశుద్ధుడవు నీవే - పరమ ప్రభుడవు నీవే దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో ||మహిమ|| 8. పరమ జనకుని మహిమన్ - పరిశుద్ధాత్మైక్యంబై సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో ||మహిమ|| Mahima Sarvonnathamaina Daivamunaki Mahi Samaadhaanaanugrahamu Galugun Prabho ||Mahima|| 1. Ninnu Sthothrimchuchu - Ninnu Poojimchuchu Ninnu Mahimaparchuchunnaamu Loka Prabho ||Mahima|| 2. Prabhuvaina Devumdaa - Paramamdalapu Raajaa Prabalambu Gala Thamdri Parishuddhambagu Prabho ||Mahima|| 3. Vinayambutho Needu - Ghana Mahimaarthambai Vamdanamu Larpimchi Vinuthimthumu Sathprabho ||Mahima|| 4. Janithaika Puthrudagu - Ghana Kreesthesu Prabhu Devuni Gorrepilla Janakuni Kumaaruda Prabho ||Mahima|| 5. Dhara Paapamulamoyu - Varapunya Sheelumdaa Karunimchi Maa Beeda Moralaalimchumu Prabho ||Mahima|| 6. Thamdriyaina Devuni - Dakshina Bhaagamuna Goorchumdi Yunnaavu Krupa Joopumi Sathprabho ||Mahima|| 7. Parishuddhudavu Neeve - Parama Prabhudavu Neeve Durithaathmulanu Gaana Maranambaithivi Prabho ||Mahima|| 8. Parama Janakuni Mahiman - Parishuddhaathmaikyambai Sarani Maakai Yunna Sarvonnatha Prabho ||Mahima||