మహిమగల తండ్రి - YouWorship
Mahimagala Thandri
Artist: డేవిడ్ రాజు
Category: Correction
Song Lyrics
మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు మహితోటలో నర మొక్కలు నాటించాడు (2) తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు (2) కాయవే తోటా – కమ్మని కాయలు పండవే చెట్టా – తియ్యని ఫలములు (2) ||మహిమ|| నీతి పూత జాతి కర్త – ఆత్మ సుతా ఫలములు నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ ఫలములు (2) అనంతమైన ఆత్మ బంధ – అమర సుధా కాంతులు (2) అనుకూల సమయమయ్యె – పూయు పరమ పూతలు (2) ||కాయవే|| అపవాది కంటబడి – కుంటుబడి పోకు కాపుకొచ్చి చేదు పండ్లు – గంపలుగా కాయకు (2) అదిగో గొడ్డలి వేరు – పదును పెట్టియున్నది (2) వెర్రిగా చుక్కలనంటి – ఎదిగి విర్రవీగకు (2) ||కాయవే|| కలువరి కొండలో పుట్టి – పారిన కరుణా నిధి కలుషమైన చీడ పీడ – కడిగిన ప్రేమానిధి (2) నిజముగాను నీవు – నీ సొత్తు కావు (2) యజమాని వస్తాడు – ఏమి ఫలములిస్తావు (2) ||కాయవే|| ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు మోదమెంతో ఉంచాడు – మోడుబారి పోకు (2) ముండ్ల పొదలలో కృంగి – మెత్తబడి పోకు (2) పండ్లు కోయ వచ్చువాడు – అగ్నివేసి పోతాడు (2) ||కాయవే|| Mahimagala Thandri – Manchi Vyavasaayakudu Mahi Thotalo Nara Mokkalu Naatinchaadu (2) Thana Puthruni Raktha Neeru – Thadi Katti Penchaadu Thana Parishuddhaathmanu – Kaapugaa Unchaadu (2) Kaayave Thotaa – Kammani Kaayalu Pandave Chettaa – Thiyyani Phalamulu (2) ||Mahima|| Neethi Pootha Jaathi Kartha – Aathma Suthaa Phalamulu Nee Thandri Nilva Cheyu – Nithya Jeeva Nidhulu (2) Ananthamaina Aathma Bandha – Amara Sudhaa Kaanthulu (2) Anukoola Samayamayye – Pooyu Parama Poothalu (2) ||Kaayave|| Apavaadi Kantabadi – Kuntubadi Poku Kaapukochchi Chedu Pandlu – Gampalugaa Kaayaku (2) Adigo Goddali Veru – Padunu Pettiyunnadi (2) Verrigaa Chukkalananti – Edigi Virraveegaku (2) ||Kaayave|| Kaluvari Kondalo Putti – Paarina Karunaa Nidhi Kalushamaina Cheeda Peeda – Kadigina Premaanidhi (2) Nijamugaanu Neevu – Nee Sotthu Kaavu (2) Yajamaani Vasthaadu – Emi Phalamulisthaavu (2) ||Kaayave|| Muddugaa Penchaadu – Moddugaa Nundaku Modamentho Unchaadu – Modubaari Poku (2) Mundla Podalalo Krungi – Metthabadi Poku (2) Pandlu Koya Vachchuvaadu – Agnivesi Pothaadu (2) ||Kaayave||