మహా దేవుడవీ - YouWorship
Mahaa Devudavee
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మహాదేవుడ వీవే (2) సర్వదర్శి - సర్వజ్ఞాని (2) సర్వవ్యాపి- యేసు నీవే (2) 1. నీదు కార్యముల్ అద్భుతముల్ - గొప్పది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది - సర్వ సృష్టికి కర్తవు నీవే (నీవే సర్వమందు ఉన్నవాడవు - 2) 2. గత దినములు స్మరియించగా - గొప్పది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి - దయా కిరీటము మాకిచ్చితివి (మమ్ము ఆనందింపజేసితివి ) 3. విడచితిమి ప్రత్యేకతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి సంఘ క్రమమును లెక్కచేయక - ఆత్మీయముగా నష్టపోతిమి మాదు నెపములను బాపుము - (మమ్ము క్షమించి, సరిచేయుము) 4. రానున్న దినములలో - స్థిరముగా నుండ దయచూపుము నన్ను నీకే అర్పించుకొందున్ - నీదు మాటకు లోబడెదన్ (నేడే నాతో మాట్లాడుము ) 5. మహా మహిమతో వచ్చెదవు - లోకము నిన్ను చూడజాలదు సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదన్, (నిన్నే బహుమానముగా పొందెదన్ ) Pallavi: Mahaadevuda Veeve (2) Sarvadarshi - Sarvagnaani (2) Sarvavyaapi- Yesu Neeve (2) 1. Needu Kaaryamul Adbhuthamul - Goppadi Nee Aalochana Needu Sangkalpan Balamainadi - Sarva Srushtiki Karthavu Neeve (Neeve Sarvamandu Unnavaadavu - 2) 2. Gatha Dinamulu Smariyinchagaa - Goppadi Nee Vishvaasyatha Mammu Kaapaadi Sanrakshinchithivi - Dayaa Kireetamu Maakichchithivi (Mammu Aanandimpajesithivi ) 3. Vidachithimi Prathyekathanu Ennosaarlu Ninnu Duhkha Pettithimi Sanggha Kramamunu Lekkacheyaka - Aathmayamugaa Nashtapothimi Maadu Nepamulanu Baapumu - (Mammu Kshaminchi, Saricheyumu) 4. Raanunna Dinamulalo - Sthiramugaa Nunda Dayachoopumu Nannu Neeke Arpinchukondun - Needu Maataku Lobadedan (Nede Naatho Maatlaadumu ) 5. Mahaa Mahimatho Vachchedavu - Lokamu Ninnu Choodajaaladu Sampoornamugaa Nannu Siddhaparachumu Itharulanu Siddhaparachedan, (Ninne Bahumaanamugaa Pondedan )