మహాఘనుడు, మహోన్నతుడు - YouWorship
Mahaaghanudu, Mahonnathudu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి (2) మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణనిధి (2) 1. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు (2) అయినను - నలిగిన వినయంపు దీనమనస్సులో నివసించును జీవించును (2) 2. దినమెల్ల ప్రభుకై వధియింపబడి యున్నట్టి గొఱ్ఱెలము అయినను - ప్రేమించినవాని ప్రేమను బట్టియే పొందితిమి విజయమును 3. మోసము, శిక్షయు, దుఃఖమును, దరిద్రత కలిగియున్నాము అయినను - సత్యము, జీవము, సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి 4. పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా అయినను - తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ 5. మన క్రీస్తును బట్టి యెల్లప్పుడు నిందకు పాత్రులమైతిమి అయినను - ఎల్లప్పుడు వూరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు Pallavi: Mahaaghanudu, Mahonnathudu, Parishuddhadu, Nithyanivaasi (2) Maa Saamarthyamu Punaruththaanamu Maa Jeevamu Maa Rakshananidhi (2) 1. Unnatha Parishuddha Sthalamulalo Nivasinchuvaadu Parishuddhadu (2) Ayinanu - Naligina Vinayampu Deenamanassulo Nivasinchunu Jeevinchunu (2) 2. Dinamella Prabhukai Vadhiyimpabadi Yunnatti Gorrelamu Ayinanu - Preminchinavaani Premanu Battiye Pondithimi Vijayamunu 3. Mosamu, Shikshayu, Duhkhamunu, Daridratha Kaligiyunnaamu Ayinanu - Sathyamu, Jeevamu, Santhoshamunu Aishvaryamul Pondithimi 4. Padipoyi Memuntimi Andhakaaramanduntimigaa Ayinanu - Thirigi Lethumu Yehovaaye Maa Velugu Maa Rakshana 5. Mana Kreesthunu Batti Yellappudu Nindaku Paathrulamaithimi Ayinanu - Ellappudu Vooreginchunu Mammu Vijayamutho Sthothramulu