మరువని నీదు ప్రేమతో - YouWorship
Maruvani Needu Prematho
Artist: సాయారం గట్టు
Category: Thanksgiving
Song Lyrics
మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2) ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2) ||మరువని|| కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2) పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2) ||మరువని|| నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీది తల్లి మరచినా మరచి పోక కాపు కాసే ప్రేమ నీది (2) పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయా కిరీటము నీవు ఇచ్ఛే వాగ్ధానాలు చేయు అధికము బ్రతుకు దినములు (2) ||మరువని|| Maruvani Needu Prematho Kaachithivi Kanupaapagaa Viduvani Snehabandhamai Nadichithive Naa Thodugaa (2) Inthavaraku Unna Oopiri Needu Dayaku Saakshyamegaa Pondukunna Melulanni Needu Ennika Phalithamegaa (2) ||Maruvani|| Karuguthunna Kaalamanthaa Needu Krupalo Nannu Thadipe Velugu Panche Needu Vaakyam Needu Maargamu Naaku Thelipe (2) Paadedanu Noothana Geethamulu Ella Velala Sthuthigaanamulu Ghanatha Mahima Aaropanamu Naadu Jeevithame Arpithamu (2) ||Maruvani|| Ninna Nedu Ennadainaa Maariponi Manasu Needi Thalli Marachinaa Marachipoka Kaapu Kaase Prema Needi (2) Pondukunna Janma Dinamu Neevu Ichche Dayaa Kireetamu Neevu Ichche Vaagdhaanaalu Cheyu Adhikamu Brathuku Dinamulu (2) ||Maruvani||