మన మధ్యనే ఉన్నది - YouWorship
Mana Madhyane Unnadi
Artist: పి ఐసాక్
Category: Encouraging
Song Lyrics
మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం (2) పాపము లేదు పరలోకంలో వ్యాధులు బాధలు లేనే లేదు పాపము లేదు పరలోకంలో వ్యాధులు బాధలు అసలే లేవు నీ రాజ్యం మాకొచ్చును గాక నీ చిత్తం భువిపై జరుగును గాక పరలోక రాజ్యాన్ని ఈ భువిపై మేము ఇప్పుడే అనుభవిస్తాము – (2) ఇక్కడే అనుభవిస్తాము సిలువలో మన శాపం తొలగిపోయెను ఆశీర్వాదముకు మనము వారసులం దారిద్య్రముతో లేదు మాకు సంబంధం ఆత్మలో ఫలియించి వర్థిల్లెదం అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము కృప క్షేమములే మాకిక సొంతము అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము కృప క్షేమములే మా సొంతము ||నీ రాజ్యం|| ఆలు మగలు ఒకరికి ఒకరు త్యాగ మూర్తులై కలసి జీవించుటయే పరలోక రాజ్యం కలతలు లేవు మాకు కన్నీరు తెలియదు సంతోషముతో మేము సాగిపోతాము ఈ తరానికి మాదిరిగా మేముంటాము పరలోక ప్రేమతో కలిసి జీవిస్తాం (2) ||నీ రాజ్యం|| Mana Madhyane Unnadi Paraloka Raajyam Mana Madhyane Unnadi Devuni Raajyam (2) Paapamu Ledu Paralokamlo Vyadhulu Baadhalu Lene Ledu Paapamu Ledu Paralokamlo Vyadhulu Baadhalu Asale Levu Nee Raajyam Maakochchunu Gaaka Nee Chittham Bhuvipai Jarugunu Gaaka Paraloka Raajyaanni Ee Bhuvipai Memu Ippude Anubhavisthaamu – (2) Ikkade Anubhavisthaamu Siluvalo Mana Shaapam Tholagipoyenu Aasheervaadamuku Manamu Vaarasulam Daaridryamutho Ledu Maaku Sambandham Aathmalo Phaliyinchi Vardhilledam Annitilo Soukhyamugaa Memundumu Krupa Kshemamule Maakika Sonthamu Annitilo Soukhyamugaa Memundumu Krupa Kshemamule Maa Sonthamu ||Nee Raajyam|| Aalu Magalu Okariki Okaru Thyaaga Moorthulai Kalasi Jeevinchutaye Paraloka Raajyam Kalathalu Levu Maaku Kanneeru Theliyadu Santhoshamutho Memu Sagipothaamu Ee Tharaaniki Maadirigaa Memuntaamu Paraloka Prematho Kalisi Jeevisthaam (2) ||Nee Raajyam||