మన బలమైన యాకోబు దేవునికి - YouWorship
Mana Balamaina Yaakobu Devuniki
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: మన బలమైన యాకోబు దేవునికి (2) - గానము సంతోషముగా పాడుడీ (2) అను పల్లవి: పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి - సితార స్వరమండలము వాయించుడి (2) 1. అమావాస్య పున్నమ పండుగ దినములందు (2) కొమ్మునూదుడి యుత్సాహముతోడ (2) యాకోబు దేవుడు నిర్ణయించిన - ఇశ్రాయేలీయుల కది కట్టడ (2) 2. తానైగుప్తులో తిరిగినప్పుడు - యోసేపు సంతతికి సాక్షముగ నిర్ణయించెను దేవుడు అచ్చట - నే నెరుగని భాషను నే వింటిని 3. తమభుజము నుండి బరువు దింపగ - మోతగంపల భారము దప్పెను నీవాపదయందు మొఱపెట్టగా - విడిపించిన యెహోవాను నేనే 4. ఉరుము దాగుచోటులో నుండినే - ఉత్తరమిచ్చి నిన్ను శోధించితిని మెరీబా జలముల యొద్ద నిన్ను - నా ప్రజలారా నా మాట వినుడి 5. ఇగుప్తు దేశములో నుండి నిన్ను - రప్పించిన యెహోవా దేవుడను నీవు నీ నోరు బాగుగా తెరువుము - నేను నింపెదను మంచి వాటితో 6. అతి శ్రేష్ఠమైన గోధుమలను - అనుగ్రహించి పోషించెద నిన్ను కొండ తేనెనిచ్చి కడు ప్రేమతో - తృప్తి పరచెదను నిత్యముగా 7. అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట - వినిన పక్షాన ఎంత మేలగు అన్యదేవతల నెవ్వరికిని - నీవు ఎన్నడు పూజ చేయరాదు Pallavi: Mana Balamaina Yaakobu Devuniki (2) - Gaanamu Santhoshamugaa Paadudee (2) Anu Pallavi: Paatalu Paadi Gilaka Thappeta Kottudi - Sithaara Svaramandalamu Vaayinchudi (2) 1. Amaavaasya Punnama Panduga Dinamulandu (2) Kommunoodudi Yuthsaahamuthoda (2) Yaakobu Devudu Nirnayinchina - Ishraayeleeyula Kadi Kattada (2) 2. Thaanaigupthulo Thiriginappudu - Yosepu Santhathiki Saakshamuga Nirnayinchenu Devudu Achchata - Ne Nerugani Bhaashanu Ne Vintini 3. Thamabhujamu Nundi Baruvu Dimpaga - Mothagampala Bhaaramu Dappenu Neevaapadayandu Morapettagaa - Vidipinchina Yehovaanu Nene 4. Urumu Daaguchotulo Nundine - Uththaramichchi Ninnu Shodhinchithini Mereebaa Jalamula Yodda Ninnu - Naa Prajalaaraa Naa Maata Vinudi 5. Igupthu Deshamulo Nundi Ninnu - Rappinchina Yehovaa Devudanu Neevu Nee Noru Baagugaa Theruvumu - Nenu Nimpedanu Manchi Vaatitho 6. Athi Shreshthamaina Godhumalanu - Anugrahinchi Poshincheda Ninnu Konda Thenenichchi Kadu Prematho - Thrupthi Parachedanu Nithyamugaa 7. Ayyo Ishraayelu Neevu Naa Maata - Vinina Pakshaana Entha Melagu Anyadevathala Nevvarikini - Neevu Ennadu Pooja Cheyaraadu