మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు - YouWorship
Mana Devuni Pattanamandaayana Parishuddha Parvathamandu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: మన దేవుని పట్టణమందాయన - పరిశుద్ధ పర్వతమందు (1) యెహోవా గొప్పవాడును - బహు కీర్తనీయుడై యున్నాడు (2) 1. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన - సీయోను పర్వతము (2) ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది (2) 2. దాని నగరులలో దేవుడాశ్రయముగా - ప్రత్యక్షంబగుచున్నాడు రాజులేకముగా కూడి ఆశ్చర్యపడి - భ్రమపడి త్వరగా వెళ్ళిరి 3. అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ - వేదన పట్టెను తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడల - పగులగొట్టుచున్నావు 4. సైన్యము లధిపతి యెహోవా దేవుని - పట్టణమునందు మనము వినినట్టి రీతిగా జరుగుట - మనము చూచితిమి 5. మన దేవుడు నిత్యముగా దానిని స్థిర - పరచియున్నాడు దేవా నీ ఆలయ మందున నీ కృప - ను ధ్యానించితిమి 6. దేవా నీ నామము ఎంత గొప్పదో - నీ సత్కీర్తియును భూదిగంతముల వరకు అంత - గొప్పదై యున్నది 7. ఈ దేవుడు సదాకాలము మనకు - దేవుడై యున్నాడు మనల నడిపించును మరణపర్యంతము - హల్లెలూయా - ఆమెన్ Pallavi: Mana Devuni Pattanamandaayana - Parishuddha Parvathamandu (1) Yehovaa Goppavaadunu - Bahu Keerthaneeyudai Yunnaadu (2) 1. Uththara Dikkuna Mahaaraaju Pattanamaina - Seeyonu Parvathamu (2) Unnathamai Andamugaa Sarvabhoomiki Santhoshamichchu Chunnadi (2) 2. Daani Nagarulalo Devudaashrayamugaa - Prathyakshambaguchunnaadu Raajulekamugaa Koodi Aashcharyapadi - Bhramapadi Thvaragaa Velliri 3. Achchata Vaarala Vanakunu Prasavinchu Sthree - Vedana Pattenu Thoorpu Gaalini Repi Tharsheeshu Odala - Pagulagottuchunnaavu 4. Sainyamu Ladhipathi Yehovaa Devuni - Pattanamunandu Manamu Vininatti Reethigaa Jaruguta - Manamu Choochithimi 5. Mana Devudu Nithyamugaa Daanini Sthira - Parachiyunnaadu Devaa Nee Aalaya Manduna Nee Krupa - Nu Dhyaaninchithimi 6. Devaa Nee Naamamu Entha Goppado - Nee Sathkeerthiyunu Bhoodiganthamula Varaku Antha - Goppadai Yunnadi 7. Ee Devudu Sadaakaalamu Manaku - Devudai Yunnaadu Manala Nadipinchunu Maranaparyanthamu - Hallelooyaa - Aamen