మనిషిగా పుట్టినోడు - YouWorship
Manishigaa Puttinodu
Artist: ఏ ఆర్ స్టీవెన్సన్
Category: Gospel
Song Lyrics
మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలవవలయురా తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇల సంపాదన వదలవలయురా (2) దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2) ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2) క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2) ||మనిషిగా|| జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడే జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2) ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే నీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2) ||మనిషిగా|| నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు (2) నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుచుకో (2) ||మనిషిగా|| Manishigaa Puttinodu Mahaathmudainaa Marala Mantilo Kalavavalayuraa Theesukoni Poledu Poochika Pullainaa Ila Sampaadana Vadalavalayuraa (2) Deepamundagaane Illu Chakkabettuko Praanamundagaane Neevu Prabhuni Nammuko (2) Okesaari Janmisthe Rendu Saarlu Chaavaali Aariponi Agnilo Yugayugaalu Kaalaali (2) Kreesthulo Puttinollu Rendava Maaru Swargaaniki Aayanatho Vaarasulauthaaru (2) ||Manishigaa|| Janmanichchinavaadu Yesu Kreesthu Devude Janminchakamunde Ninnerigina Naathude (2) Aayananu Nammi Punarjanma Pondithe Nee Janmaku Nijamaina Ardhamundile (2) ||Manishigaa|| Neelo Unna Oopiri Gaalani Bhramapadaku Chachchinaaka Emauno Evariki Thelusanaku (2) Neeloni Aathmaku Swargamo Narakamo Nirnayinchu Samayamide Kallu Theruchuko (2) ||Manishigaa||