మనస యేసు మరణ బాధ - YouWorship
Manasa Yesu Marana Baadha
Artist: మిక్కిలి సమూయేలు
Category: Good Friday
Song Lyrics
మనస యేసు మరణ బాధ – లెనసి పడవే తన – నెనరు జూడవే యా – ఘనుని గూడవే నిను – మనుప జచ్చుటరసియే – మరక వేడవే ||మనస|| అచ్చి పాపములను బాప – వచ్చినాడట వా-క్కిచ్చి తండ్రితో నా – గెత్సేమందున తా – జొచ్చి యెదను నొచ్చి బాధ – హెచ్చుగనెనట ||మనస|| ఆ నిశీధ రాత్రి వేళ – నార్భటించుచు న-య్యో నరాంతకుల్ చే-బూని యీటెలన్ ఒక – ఖూని వానివలెను గట్టి – కొంచుబోయిరా ||మనస|| పట్టి దొంగవలెను గంత – గట్టి కన్నులన్ మరి – గొట్టి చెంపలన్ వడి – దిట్టి నవ్వుచున్ నిను – గొట్టి రెవ్వరదియు మాకు – జెప్పమనిరట ||మనస|| ముళ్ల తోడ నొక కిరీట – మల్లి ప్రభు తలన్ బెట్టి – రెల్లు కర్రతో నా – కళ్ళ జనములు రా-జిల్లు మనుచు గొట్టి నవ్వి – గొల్లు బెట్టిరా ||మనస|| మొయ్యలేక సిల్వ భారము – మూర్చ బోయెనా అ-య్యయ్యో జొక్కెనా యే-సయ్య తూలెనా మా – యయ్యనిన్ దలంపగుండె – లదరి పోయెనా ||మనస|| కాలు సేతులన్ గుదించి – కల్వరి గిరిపై నిన్ – గేలి జేయుచు నీ – కాళ్ళ మీదను నినుప – చీలలతో గృచ్చి నిన్ను – సిల్వ గొట్టిరా ||మనస|| దేవ సుతుడా వైతి వేని – తీవరంబుగా దిగి – నీవు వేగమే రమ్ము – గావు మనుచును ఇట్లు – గావరించి పల్కు పగర – కరుణ జూపెనా ||మనస|| తన్ను జంపు శత్రువులకు – దయను జూపెనా తన – నెనరు జూపెనా ప్రభు – కనికరించెనా ఓ – జనక యీ జనుల క్షమించు – మనుచు వేడెనా ||మనస|| తాళలేని బాధ లీచ్చి – దాహమాయెనా న-న్నేలువానికి నా – పాలి స్వామికి నే-నేల పాపములను జేసి – హింస పరచితి ||మనస|| గోడు బుచ్చి సిలువపైన – నేడు మారులు మా-ట్లాడి ప్రేమతో నా – నాడు శిరమును వంచి – నేడు ముగిసె సర్వ మనుచు – వీడె ప్రాణము ||మనస|| మరణమైన ప్రభుని జూచి – ధరణి వణకెనా బల్ – గిరులు బగిలెనా – గుడి తెరయు జీలెనా దివా-కరుడు చీకటాయె మృతులు – తిరిగి లేచిరి ||మనస|| ఇంత జాలి యింత ప్రేమ – యింత శాంతమా నీ – యంత కరుణను నే – జింత చేయగా నీ – వింత లెల్ల నిత్య జీవ – విధము లాయెనా ||మనస|| Manasa Yesu Marana Baadha – Lenasi Padave Thana – Nenaru Joodave Yaa – Ghanuni Goodave Ninu – Manupa Jachchutarasiye – Maraka Vedave ||Manasa|| Achchi Paapamulanu Baapa – Vachchinaadata Vaa-kkichchi Thandritho Naa – Gethsemanduna Thaa – Jochchi Yedanu Nochchi Baadha – Hechchuganenata ||Manasa|| Aa Nisheedha Raathri Vela – Naarbhatinchuchu Na-yyo Naraanthakul Che-booni Yeetelan Oka – Khooni Vaanivalenu Gatti – Konchuboyiraa ||Manasa|| Patti Dongavalenu Gantha – Gatti Kannulan Mari – Gotti Chempalan Vadi – Ditti Navvuchun Ninu – Gotti Revvaradiyu Maaku – Jeppamanirata ||Manasa|| Mulla Thoda Noka Kireeta – Malli Prabhu Thalan Betti – Rellu Karratho Naa – Kalla Janamulu Raa-jillu Manuchu Gotti Navvi – Gollu Bettiraa ||Manasa|| Moyyaleka Silva Bhaaramu – Moorcha Boyenaa A-yyayyo Jokkenaa Ye-sayya Thoolenaa Maa – Yayyanin Dalampagunde – Ladari Poyenaa ||Manasa|| Kaalu Sethulan Gudinchi – Kalvari Giripai Nin- Geli Jeyuchu Nee – Kaalla Meedanu Ninupa – Cheelalatho Gruchchi Ninnu – Silva Gottiraa ||Manasa|| Deva Suthuda Vaithi Veni – Theevarambugaa Digi – Neevu Vegame Rammu – Gaavu Manuchunu Itlu – Gaavarinchi Palku Pagara – Karuna Joopenaa ||Manasa|| Thannu Jampu Shathruvulaku – Dayanu Joopenaa Thana – Nenaru Joopenaa Prabhu – Kanikarinchenaa O – Janaka Yee Janula Kshaminchu – Manuchu Vedenaa ||Manasa|| Thaalaleni Baadha Lechchi – Daahamaayenaa Na-nneluvaaniki Naa – Paali Swaamiki Ne-nela Paapamulanu Jesi – Himsa Parachithi ||Manasa|| Godu Buchchi Siluvapaina – Nedu Maarulu Maa-tlaadi Prematho Naa – Naadu Shiramunu Vanchi – Nedu Mugise Sarva Manuchu – Veede Praanamu ||Manasa|| Maranamaina Prabhuni Joochi – Dharani Vanakenaa Bal – Girulu Bagilenaa – Gudi Therayu Jeelenaa Divaa-karudu Cheekataaye Mruthulu – Thirigi lechiri ||Manasa|| Intha Jaali Yintha Prema – Yintha Shaanthamaa Nee – Yantha Karunanu Ne – Jintha Cheyagaa Nee – Vintha Lella Nithya Jeeva – Vidhamu Laayenaa ||Manasa||