మనసెరిగిన యేసయ్యా - YouWorship
Manaserigina Yesayyaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు (2) హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు (2) ||మనసెరిగిన|| నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా (2) సాహసక్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన|| వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2) ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2) ||మనసెరిగిన|| మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా (2) నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన|| Manaserigina Yesayyaa Madilona Jathagaa Nilichaavu (2) Hrudayaana Nee Aagnalu Wraasi Nee Pathrikanugaa Maarchaavu (2) ||Manaserigina|| Nirjeeva Kriyalanu Vidichi Paripoorna Parishuddhathakai Saagipodunu Nenu Aagipolenugaa (2) Saahasa Kriyalu Cheyu Nee Hasthamutho Nannu Pattukontive Viduvalevu Ennadu (2) ||Manaserigina|| Venakunna Vaatini Marachi Nee Thodu Nenu Kori Aathmeeya Yaathralo Nenu Sommasilliponugaa (2) Aascharyakriyalu Cheyu Dakshina Hasthamutho Nannu Aadukontive Edabaayavu Ennadu (2) ||Manaserigina|| Marthyamaina Dehamu Vadili Amarthyathanu Pondutakai Prabhu Ballaaraadhanaku Dooramu Kaalenugaa (2) Nela Mantitho Nannu Roopinchina Hasthamule Nannu Kougilinchene Vadalalevu Ennadu (2) ||Manaserigina||