మనమే ప్రభుని పరలోక గృహము - YouWorship
Maname Prabhuni Paraloka Gruhamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మనమే ప్రభుని పరలోక గృహము - తానే వసించును దానియందు (2) 1. ఎంత సుందరమో ప్రభుని గృహము (2) - నలుదిక్కులనుండి కూర్చెనుగా (2) ఏక శరీరము రక్తబంధముచే (2) వేలాది భాషల నుండినను (2) 2. ఒక నూతన వ్యక్తిగా మము జేసె - పరమ గృహమునకు చెందితిమి ఐక్యతతో స్థిరముగ నమర్చబడి దేవుని గుడారముగా నైతిమి 3. నల్లని తెల్లని వారని లేదు - ధనికులు దరిద్రులనియు లేదు పామరులని జ్ఞానులని లేదు యేసు ప్రభువే సర్వముగా 4. ప్రభుని గృహమున కలహము లేదు (2) - ఈర్ష్య కపట భేధము లేదు శాంతి ఆనందము నిజ ప్రేమయుండును నేర్పుతో నడుపును మన ప్రభువే 5. ప్రభుని గృహము యిద్ధరయందున్నది - తన దాసుల కధికారమిచ్చె ప్రతివానికి వాని పని నియమించె కావలి యుండుము మెలకువతో 6. దృఢ విశ్వాసము మదినందుంచి - విజయులలై యాత్రలో సాగెదము ఆదర్శులమై ఈ జగమందున పూర్తిగ శత్రువు నోడింతుము 7. ప్రియుని దినము సమీపించు చున్నది - చెప్పెను మేల్కొని యుండుమని విశ్వాస యోగ్యులముగ జీవించి ఓరిమితో వేచియుండెదము Pallavi: Maname Prabhuni Paraloka Gruhamu - Thaane Vasinchunu Daaniyandu (2) 1. Entha Sundaramo Prabhuni Gruhamu (2) - Naludikkulanundi Koorchenugaa (2) Eka Shareeramu Rakthabandhamuche (2) Velaadi Bhaashala Nundinanu (2) 2. Oka Noothana Vyakthigaa Mamu Jese - Parama Gruhamunaku Chendithimi Aikyathatho Sthiramuga Namarchabadi Devuni Gudaaramugaa Naithimi 3. Nallani Thellani Vaarani Ledu - Dhanikulu Daridrulaniyu Ledu Paamarulani Gnaanulani Ledu Yesu Prabhuve Sarvamugaa 4. Prabhuni Gruhamuna Kalahamu Ledu (2) - Eershya Kapata Bhedhamu Ledu Shaanthi Aanandamu Nija Premayundunu Nerputho Nadupunu Mana Prabhuve 5. Prabhuni Gruhamu Yiddharayandunnadi - Thana Daasula Kadhikaaramichche Prathivaaniki Vaani Pani Niyaminche Kaavali Yundumu Melakuvatho 6. Drudha Vishvaasamu Madinandunchi - Vijayulalai Yaathralo Saagedamu Aadarshulamai Ee Jagamanduna Poorthiga Shathruvu Nodinthumu 7. Priyuni Dinamu Sameepinchu Chunnadi - Cheppenu Melkoni Yundumani Vishvaasa Yogyulamuga Jeevinchi Orimitho Vechiyundedamu