మనమేసుని వారలము - YouWorship
Manamesuni Vaaralamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
"మనము ఆయన మహిమను కనుగొంటిమి." యోహాను John 1:14 పల్లవి : మనమేసుని వారలము - తనవారిగానే యుందుము మనలను రక్షించెను - తనకే స్తుతి పాడెదము 1. కృపాసత్య సంపూర్ణ వాక్యము - నరరూపియాయెను కనుగొంటిమి తండ్రి మహిమను - జనితైక కుమారునిలో తన ప్రేమ అద్భుతమైనది - మనము కొనియాడెదము || మనమేసుని || 2. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను మనలను తానే వెలిగించెను - తన వాక్యము ద్వారనే ప్రభు వుత్తముడని యెరిగి - తనకే స్తుతి పాడెదము || మనమేసుని || 3. దైవపుత్రుండు సజీవరాళ్ళతో - యింటిని కట్టుచున్నాడు దేవుని తేజము రాగా - మహిమతో నిండె గృహము ఆయన మందిరములో - తన మహిమను పాడెదము || మనమేసుని || 4. ఎందరిని ప్రభు ముందు యెరిగెనో - వారిని నిర్ణయించెను పిలిచి నీతిగా తీర్చి - మహిమ పరచెను తన తనయుని రూపమిచ్చె - మన మానంద మొందెదము || మనమేసుని || 5. పూర్ణమహిమతో మనప్రభు యేసు - దూతలతో వచ్చును కనిపెట్టు వారెత్తబడెదరు - తన మహిమ పొందెదరు తన రాజ్యముగా జేసె - హల్లెలూయ పాడెదము || మనమేసుని || 6. మహిమ నివసించు మహిమ రాజ్యంబు మహిమతో నిండి యుండును మన ప్రభువే దీపమై యుండును తన వెలుగు ప్రచురమగున్ యుగయుగములు మనమంతా ప్రభుయేసుతో నుండెదము || మనమేసుని || "Manamu Aayana Mahimanu Kanugontimi." Yohaanu John 1:14 Pallavi : Manamesuni Vaaralamu - Thanavaarigaane Yundumu Manalanu Rakshinchenu - Thanake Sthuthi Paadedamu 1. Krupasathya Sampoorna Vaakyamu - Nararoopiyaayenu Kanugontimi Thandri Mahimanu - Janithaika Kumaarunilo Thana Prema Adbhuthamainadi - Manamu Koniyaadedamu || Manamesuni || 2. Vaaru Aayana Thattu Choodagaa Velugu Kaligenu Manalanu Thaane Veliginchenu - Thana Vaakyamu Dvaarane Prabhu Vuththamudani Yerigi - Thanake Sthuthi Paadedamu || Manamesuni || 3. Daivaputhrundu Sajeevaraallatho - Yintini Kattuchunnaadu Devuni Thejamu Raagaa - Mahimatho Ninde Gruhamu Aayana Mandiramulo - Thana Mahimanu Paadedamu || Manamesuni || 4. Endarini Prabhu Mundu Yerigeno - Vaarini Nirnayinchenu Pilichi Neethigaa Theerchi - Mahima Parachenu Thana Thanayuni Roopamichche - Mana Maananda Mondedamu || Manamesuni || 5. Poornamahimatho ManaPrabhu Yesu - Doothalatho Vachchunu Kanipettu Vaareththabadedaru - Thana Mahima Pondedaru Thana Raajyamugaa Jese - Hallelooya Paadedamu || Manamesuni || 6. Mahima Nivasinchu Mahima Raajyambu Mahimatho Nindi Yundunu Mana Prabhuve Deepamai Yundunu Thana Velugu Prachuramagun Yugayugamulu Manamanthaa PrabhuYesutho Nundedamu || Manamesuni ||