మనకై యేసు మరణించె మన పాపముల కొరకై - YouWorship
Manakai Yesu Maraninche Mana Paapamula Korakai
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మనకై యేసు మరణించె మన పాపముల కొరకై (1) నిత్యజీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె (2) 1. తృణీకరింపబడె - విసర్జింపబడెను (2) దుఃఖా క్రాంతుడాయె (2) - వ్యసనముల భరించెను (1) 2. మన వ్యసనముల వహించెన్ - మన దుఃఖముల భరించెన్ మన మెన్నిక చేయకయే - మన ముఖముల ద్రిప్పితిమి 3. మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగె 4. గొర్రెలవలె తప్పితిమి - పరుగిడితిమి మనదారిన్ అరుదెంచె కాపరియై - అర్పించి ప్రాణమును 5. దౌర్జన్యము నొందెను - బాధింపబడెను తననోరు తెరువలేదు - మనకై క్రయధనమీయన్ 6. ఎదిరింపలే దెవరిన్ - లేదే కపటము నోట యెహోవా నలుగ గొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్ 7. సిలువలో వ్రేలాడెన్ - సమాధిలో నుండెను సజీవుండై లేచెన్ - స్తోత్రము హల్లెలూయ Pallavi: Manakai Yesu Maraninche Mana Paapamula Korakai (1) Nithyajeevamu Nichchutake Sathyundu Sajeevudaaye (2) 1. Thruneekarimpabade - Visarjimpabadenu (2) Duhkhaa Kraanthudaaye (2) - Vyasanamula Bharinchenu (1) 2. Mana Vyasanamula Vahinchen - Mana Duhkhamula Bharinchen Mana Mennika Cheyakaye - Mana Mukhamula Drippithimi 3. Mana Yathikramamula Koraku - Mana Doshamula Koraku Mana Naathudu Shikshanonde - Manaku Svasthatha Kalige 4. Gorrelavale Thappithimi - Parugidithimi Manadaarin Arudenche Kaapariyai - Arpinchi Praanamunu 5. Daurjanyamu Nondenu - Baadhimpabadenu Thananoru Theruvaledu - Manakai Krayadhanameeyan 6. Edirimpale Devarin - Lede Kapatamu Nota Yehovaa Naluga Gotten - Mahaavyaadhini Kaliginchen 7. Siluvalo Vrelaaden - Samaadhilo Nundenu Sajeevundai Lechen - Sthothramu Hallelooya