మనకు జీవమైయున్న - YouWorship
Manaku Jeevamaiyunna
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే (2) 1. దేవుని దీవెనలు పొంద (2) యౌవనులార యేసుని సన్నిధికి రారండి (2) దైవకుమారుడు పావన క్రీస్తుని జీవము పొంది నడువుడి (2) 2. యేసు నంగీకరించెడి వారి పేరులు జీవగ్రంథమునందు - వ్రాయబడున్ నమ్మకమైయున్న పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి 3. దేవుని స్వరూపము కల్గిన యేసు ప్రభు మనుజరూపంబున జన్మించెను చావును గెల్చిన పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి 4. యేసు రక్తములో కడుగబడిన తెల్లని వస్త్రముల్ ధరియించి రారండి గొప్ప కృపానిధి పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి 5. క్రీస్తు యేసుని యౌవన జనమా ఆయనకు ప్రాణము లర్పించను నిలువుడి సత్యరూపియగు పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి 6. రాజుల రాజు ప్రభుల ప్రభువు అను పేరు ఆయన వస్త్రముపై వ్రాయబడెన్ సర్వశక్తిగల పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి 7. ప్రభుని పిలుపు పొందియున్న యౌవనులార విశ్వసించి విజయము పొందుడి శత్రువు నోడించి యేసు నామమున - హల్లెలూయ పాట పాడుడి Pallavi: Manaku Jeevamaiyunna Rakshakudu Prabhuyese (2) 1. Devuni Deevenalu Ponda (2) Yauvanulaara Yesuni Sannidhiki Raarandi (2) Daivakumaarudu Paavana Kreesthuni Jeevamu Pondi Naduvudi (2) 2. Yesu Nanggeekarinchedi Vaari Perulu Jeevagranthamunandu - Vraayabadun Nammakamaiyunna Paavana Kreesthuni - Jeevamu Pondi Naduvudi 3. Devuni Svaroopamu Kalgina Yesu Prabhu Manujaroopambuna Janminchenu Chaavunu Gelchina Paavana Kreesthuni - Jeevamu Pondi Naduvudi 4. Yesu Rakthamulo Kadugabadina Thellani Vasthramul Dhariyinchi Raarandi Goppa Krupanidhi Paavana Kreesthuni - Jeevamu Pondi Naduvudi 5. Kreesthu Yesuni Yauvana Janamaa Aayanaku Praanamu Larpinchanu Niluvudi Sathyaroopiyagu Paavana Kreesthuni - Jeevamu Pondi Naduvudi 6. Raajula Raaju Prabhula Prabhuvu Anu Peru Aayana Vasthramupai Vraayabaden Sarvashakthigala Paavana Kreesthuni - Jeevamu Pondi Naduvudi 7. Prabhuni Pilupu Pondiyunna Yauvanulaara Vishvasinchi Vijayamu Pondudi Shathruvu Nodinchi Yesu Naamamuna - Hallelooya Paata Paadudi