మందార మకరంద మాధుర్యమున - YouWorship
Mandaara Makaranda Maadhuryamuna
Artist: ఆచార్య ఆరాధ్యమూర్తి
Category: Praise & Worship
Song Lyrics
మందార మకరంద మాధుర్యమున దేలు - మధుపమానా హృదయ మా 1 యేసు పదముల వ్రాలి - అమృతధారను గోలి - ఆనందమున తేలుమా(2) పరమ సింహాసనముపై కిగయుమా ||మందార|| 2. నిర్మల మందాకిని వీచికలో తూగు (2) రాజహంసా నా మానసా హంసా యేసు వాక్య తరంగ, డోలికపై వూగి హాయిగా విహరింపుమా - మోక్ష సంధాయకుని వరియించుమా ||మందార|| 3. లలిత రసాల పల్లవా - ఖాదియై వెలుగు కోయిలమ్మ - హృదయ విహంగమా - యేసు తరు శాఖపై - ఏపుగా కూర్చుండి - జీవ ఫలములన్ - భజింపుమా - రక్షకుని ప్రేమ గీతి పాడుమా ||మందార|| 4. పూర్ణేందు చంద్రిక స్ఫురితమై వెలుగొందు - చకోరమా - నా జీవనా పతాకమా Mandaara Makaranda Maadhuryamuna Delu - Madhupamaanaa Hrudaya Maa 1 Yesu Padamula Vraali - Amruthadhaaranu Goli - Aanandamuna Thelumaa(2) Parama Sinhaasanamupai Kigayumaa ||Mandaara|| 2. Nirmala Mandaakini Veechikalo Thoogu (2) Raajahansaa Naa Maanasaa Hansaa Yesu Vaakya Tharangga, Dolikapai Voogi Haayigaa Viharimpumaa - Moksha Sandhaayakuni Variyinchumaa ||Mandaara|| 3. Lalitha Rasaala Pallavaa - Khaadiyai Velugu Koyilamma - Hrudaya Vihanggamaa - Yesu Tharu Shaakhapai - Epugaa Koorchundi - Jeeva Phalamulan - Bhajimpumaa - Rakshakuni Prema Geethi Paadumaa ||Mandaara|| 4. Poornendu Chandrika Sphurithamai Velugondu - Chakoramaa - Naa Jeevanaa Pathaakamaa