మంగళమే యేసునకు - YouWorship
Mangalame Yesunaku
Artist: పురుషోత్తము చౌదరి
Category: Marriage
Song Lyrics
మంగళమే యేసునకు – మానుజావతారునకు (3) శృంగార ప్రభువునకు (2) క్షేమాధిపతికి మంగళమే ||మంగళమే|| పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3) నిరుపమానందునకు (2) నిపుణ వేద్యునకు మంగళమే ||మంగళమే|| దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3) కరుణా సంపన్నునకు (2) జ్ఞాన దీప్తునకు మంగళమే ||మంగళమే|| సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3) నిత్య స్వయంజీవునకు (2) నిర్మలాత్మునకు మంగళమే ||మంగళమే|| యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3) సత్య పరంజ్యోతి యగు (2) సార్వభౌమునకు మంగళమే ||మంగళమే|| నర ఘోర కలుషముల – నురుమారంగ నిల (3) కరుదెంచిన మా పాలి (2) వర రక్షకునకు మంగళమే ||మంగళమే|| పరమపురి వాసునకు – నర దైవ రూపునకు (3) పరమేశ్వర తనయునకు (2) బ్రణుతింతుము నిన్ను మంగళమే ||మంగళమే|| Mangalame Yesunaku – Manujaavathaarunaku (3) Shrungaara Prabhuvunaku (2) Kshemaadhipathiki Mangalame ||Mangalame|| Parama Pavithrunaku – Vara Divya Thejunaku (3) Nirupamaanandunaku (2) Nipuna Vedyunaku Mangalame ||Mangalame|| Duritha Samhaarunaku – Vara Sugunodaarunaku (3) Karunaa Sampannunaku (2) Gnaana Deepthunaku Mangalame ||Mangalame|| Sathya Pravarthunaku – Saddharma Sheelunaku (3) Nithya Swayamjeevunaku (2) Nirmalaathmunaku Mangalame ||Mangalame|| Yuktha Sthothraarhunaku – Bhaktha Rakshaamaniki (3) Sathya Paramjyothi Yagu (2) Saarvabhoumunaku Mangalame ||Mangalame|| Nara Ghora Kalushamula – Nurumaaranga Nila (3) Karudenchina Maa Paali (2) Vara Rakshakunaku Mangalame ||Mangalame|| Paramapuri Vaasunaku – Nara Daiva Roopunaku (3) Parameshwara Thanayunaku (2) Branuthinthumu Ninnu Mangalame ||Mangalame||