మంగళంబని పాడరే క్రీస్తుకు - YouWorship
Manggalambani Paadare Kreesthuku
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
మంగళంబని పాడరే - క్రీస్తుకు జయ మంగళంబని పాడరే - యేసుకు జయ మంగళంబని పాడరే - మంగళంబని పాడి యుప్పాంగి జయజయ ||మంగళ|| 1. ఘన యూద దేశంబులో - బెత్లెహేమున యూదా గోత్రంబులో వినుండు యోసేపునకు సతియై - తనరుచుండెడి మరియ కడుపున జననమై యీ మర్త్య వరులకు - సద్గతిని గల్లించు వానికి ||మంగళ|| 2. సోదరాలి భంగిని - భక్తుల నెల్ల జూచి బ్రోచెడు వానిని యూద దేశపు వారలధిక - బాధ బెట్టుచు హింసంజేసిన సాదరంబున త్రిదినములకు - ముదముతో గనుపడిన ప్రభునకు ||మంగళ|| 3. ధరణి నొల్లడి దాసజనములనుంబ్రోచు - దైవ తనయుండని నిజ మరయ నిలను స్మరించువారికి - గురుతరంబగు కలుష జలనిధి దరికిం జేర్చు పరమ పదమే - యిరు వొనర్చెద ననిన ప్రభునకు ||మంగళ|| Manggalambani Paadare - Kreesthuku Jaya Manggalambani Paadare - Yesuku Jaya Manggalambani Paadare - Manggalambani Paadi Yuppaanggi Jayajaya ||Manggala|| 1. Ghana Yooda Deshambulo - Bethlehemuna Yoodaa Gothrambulo Vinundu Yosepunaku Sathiyai - Thanaruchundedi Mariya Kadupuna Jananamai Yee Marthya Varulaku - Sadgathini Gallinchu Vaaniki ||Manggala|| 2. Sodaraali Bhanggini - Bhakthula Nella Joochi Brochedu Vaanini Yooda Deshapu Vaaraladhika - Baadha Bettuchu Hinsanjesina Saadarambuna Thridinamulaku - Mudamutho Ganupadina Prabhunaku ||Manggala|| 3. Dharani Nolladi Daasajanamulanumbrochu - Daiva Thanayundani Nija Maraya Nilanu Smarinchuvaariki - Gurutharambagu Kalusha Jalanidhi Darikin Jerchu Parama Padame - Yiru Vonarcheda Nanina Prabhunaku ||Manggala||