భూమండలము దాని సంపూర్ణత - YouWorship
Bhoomandalamu Daani Sampoornatha
Artist: మల్లెల దావీదు
Category: Praise
Song Lyrics
భూమండలము దాని సం - పూర్ణత యును లోకమును = భూమండల వాసులను - బోల్పార యెహోవావే ||భూ|| 1. యెహోవ సముద్రము మీద - భూమి పునాది వేసె = మహాజలముల మీద - మనదేవుడది స్థిరపర్చె ||భూ|| 2. యెహోవ పర్వతమునకు - నెక్కంగ పాత్రు డెవడు = మహాలయంబునందు - మరి నిల్వ యోగ్యుండు డెవడు ||భూ|| 3. అపవిత్ర మనసులేక - కపట ప్రమాణము లేక = సుపవిత్రమౌ చేతులను - శుద్ధాత్మ గల్గినవాడే ||భూ|| 4. ఆలాటి వాడు ప్రభుని యాశీర్వచనము నొందు = భూలోకమున రక్షణ దేవుని నీతి మత్వముపొందు ||భూ|| 5. ప్రభునాశ యుంచు నట్టి - వారు యాకోబు దేవ = ప్రభుసన్నిధానము వెదకు - ప్రజలెల్ల రట్టివారే ||భూ|| 6. ద్వారంబు లార యుంచ మీ తల లెత్తెత్త వలెన్ = రాజుల కొరకుతలుపు - లారా మిమ్మెత్తుకొనుండి ||భూ|| 7. ఇలలో మహా మహిమంబు - గల్గిన యా రాజెవడు = బలశౌర్య ముల యెహోవా - బహుశూరుడా యెహోవా ||భూ|| Bhoomandalamu Daani San - Poornatha Yunu Lokamunu = Bhoomandala Vaasulanu - Bolpaara Yehovaave ||Bhoo|| 1. Yehova Samudramu Meeda - Bhoomi Punaadi Vese = Mahaajalamula Meeda - Manadevudadi Sthiraparche ||Bhoo|| 2. Yehova Parvathamunaku - Nekkanga Paathru Devadu = Mahaalayambunandu - Mari Nilva Yogyundu Devadu ||Bhoo|| 3. Apavithra Manasuleka - Kapata Pramaanamu Leka = Supavithramau Chethulanu - Shuddhaathma Galginavaade ||Bhoo|| 4. Aalaati Vaadu Prabhuni Yaasheervachanamu Nondu = Bhoolokamuna Rakshana Devuni Neethi Mathvamupondu ||Bhoo|| 5. Prabhunaasha Yunchu Natti - Vaaru Yaakobu Deva = Prabhusannidhaanamu Vedaku - Prajalella Rattivaare ||Bhoo|| 6. Dvaarambu Laara Yuncha Mee Thala Leththeththa Valen = Raajula Korakuthalupu - Laaraa Mimmeththukonundi ||Bhoo|| 7. Ilalo Mahaa Mahimambu - Galgina Yaa Raajevadu = Balashaurya Mula Yehovaa - Bahushoorudaa Yehovaa ||Bhoo||