భూదిగంతముల నివాసులారా - YouWorship
Bhoodiganthamula Nivaasulaaraa
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: భూదిగంతముల నివాసులారా - నా వైపు చూచి రక్షణ పొందుడి యిదియే దేవుని ఆహ్వానము - యిదియే దేవుని రక్షణ పిలుపు 1. వినిరి అనేకులు ఆ పిలుపును - లోబడిరి వారు ఆ పిలుపునకు (2) యేసుని వైపు చూచిరి వారు (2) రక్షణనొంది ఆనందించిరి 2. శతృవు దాడికి ఎదిరించి నిలిచిరి - ప్రార్ధన ద్వారా పోరాడి గెలిచిరి యేసుని వైపు చూచుచుసాగిరి ఆత్మతో సత్యముతో ఆరాధించిరి 3. సుళువుగా చిక్కులు బెట్టు పాపమును విడువుడి - సిలువను సహించి సాక్షులైయుండుడి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించెడు యేసుని చూడుడి 4. పరిశుద్ధత మీద మీరు - మిమ్మును కట్టుకొనుడి - పరిశుద్ధాత్మతో ప్రార్ధన చేయుడి నిత్య జీవార్ధమైన కనికరమునకై యేసుని కొరకు కనిపెట్టు చుందుడి 5. దేవుడను నేనే యనె - వేరెవ్వరు లేరనెను - నీతిమంతుడును - రక్షించు వాడును యుగయుగములకు-మహిమ ఘనత ప్రభావమాయనకే కలుగును గాక Pallavi: Bhoodiganthamula Nivaasulaaraa - Naa Vaipu Choochi Rakshana Pondudi Yidiye Devuni Aahvaanamu - Yidiye Devuni Rakshana Pilupu 1. Viniri Anekulu Aa Pilupunu - Lobadiri Vaaru Aa Pilupunaku (2) Yesuni Vaipu Choochiri Vaaru (2) Rakshananondi Aanandinchiri 2. Shathruvu Daadiki Edirinchi Nilichiri - Praardhana Dvaaraa Poraadi Gelichiri Yesuni Vaipu Choochuchusaagiri Aathmatho Sathyamutho Aaraadhinchiri 3. Suluvugaa Chikkulu Bettu Paapamunu Viduvudi - Siluvanu Sahinchi Saakshulaiyundudi Vishvaasamunaku Karthayu Daani Konasaaginchedu Yesuni Choodudi 4. Parishuddhatha Meeda Meeru - Mimmunu Kattukonudi - Parishuddhathmatho Praardhana Cheyudi Nithya Jeevaardhamaina Kanikaramunakai Yesuni Koraku Kanipettu Chundudi 5. Devudanu Nene Yane - Verevvaru Leranenu - Neethimanthudunu - Rakshinchu Vaadunu Yugayugamulaku-Mahima Ghanatha Prabhaavamaayanake Kalugunu Gaaka