భీకరుండౌ మా యెహోవా - YouWorship
Bheekarundau Maa Yehovaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ|| మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము || భీకరుండౌ || ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము || భీకరుండౌ || పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని || భీకరుండౌ || మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను || భీకరుండౌ || మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను || భీకరుండౌ || Bheekarundau Maa Yehovaa – Peeta Medutan Goodare Yekamai Saashtaangapadi – Sar-veshvaruni Goniyaadare ||Bheekarundau|| Mattithone Mammu Nella – Maanavuluga Srujinchenu Itti Shakthundou Prabhun Me-mechchugaa Madi Nenthumu ||Bheekarundau|| Aerithodu Leka Mamu Sa-rveshvarudu Srushtinchenu Dhaarunin Daanokkade Maa – Daivamani Poojinthumu ||Bheekarundau|| PuttaGittan Jeya Daanai – Natti Devuni Shakthini Battugaa Lokasthulaaraa – Prasthuthimpare Bhakthini ||Bheekarundau|| Meti Sangeethambulapai – Minta Naarava Mondanu Jaatare Vevela Nollan – Sannuthul Prabhu Vandanu ||Bheekarundau|| Mikkili Kashtambulatho – Miththikini Baalpondanu Dikku Leni Gorrelatlu – Diruga Jerpan Mandanu ||Bheekarundau||