భాసిల్లెను సిలువలో - YouWorship
Bhaasillenu Siluvalo
Artist: ఏ బి మాసిలామని
Category: Good Friday
Song Lyrics
భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను|| కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను|| దోషము చేసినది నేనెకదా మోసముతో బ్రతికిన నేనెకదా మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను|| పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను|| నీ మరణపు వేదన వృధా గాదు నా మది నీ వేదనలో మునిగెను క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను|| ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను|| నమ్మిన వారిని కాదన వనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను|| Bhaasillenu Siluvalo Paapa Kshamaa Yesu Prabhu Nee Divya Kshamaa ||Bhaasillenu|| Kaluvarilo Naa Paapamu Ponchi Siluvaku Ninnu Yaahuthi Chesi Kalusha Haraa Karuninchithivi (2) ||Bhaasillenu|| Doshamu Chesinadi Nene Kadaa Mosamutho Brathikina Nene Kadaa Mosithivaa Naa Shaapa Bhaaram (2) ||Bhaasillenu|| Paapamu Chesi Gadinchithi Maranam Shaapamegaa Nenaarjinchinadi Kaaparivai Nanu Brochithivi (2) ||Bhaasillenu|| Nee Maranapu Vedana Vrudhaa Gaadu Naa Madi Nee Vedanalo Munigenu Kshemamu Kaligenu Hrudayamulo (2) ||Bhaasillenu|| Endulako Naapai Ee Prema Andadayyaa Swamee Naa Madiki Andulake Bhayamondithini (2) ||Bhaasillenu|| Nammina Vaarini Kaadana Vaniyu Nemmadi Nosagedi Naa Prabhudavani Nammithi Nee Paadambulanu (2) ||Bhaasillenu||