భయము లేదు మనకు - YouWorship
Bhayamu Ledu Manaku
Artist: సాయారం గట్టు
Category: Encouraging
Song Lyrics
భయము లేదు మనకు ఇకపై ఎదురు వచ్చు గెలుపు అదిగో యేసు పిలుపు వినుమా పరము చేరు వరకు (2) ఫలితమేదైన ప్రభును వీడకు కష్టమెంతైన కలత చెందకు అలుపు లేకుండ పరుగు సాగని శోధనలు నిన్ను చూసి బెదరని ||భయము|| సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని (2) కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని (2) ||ఫలిత|| మండించే అగ్గితోనే మెరయును బంగారము శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము (2) నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా (2) ||ఫలిత|| కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము (2) నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి (2) ||ఫలిత|| ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు (2) తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు (2) ||ఫలిత|| Bhayamu Ledu Manaku Ikapai Eduru Vachchu Gelupu Adigo Yesu Pilupu Vinumaa Paramu Cheru Varaku (2) Phalithamedaina Prabhunu Veedaku Kashtamenthaina Kalatha Chendaku Alupu Lekunda Parugu Saagani Shodhanalu Ninnu Choosi Bedarani ||Bhayamu|| Sandhinchina Baanamalle Nee Guri Konasaagani Mana Thandri Vaagdhaanale Oopirigaa Maarani (2) Kashtaale Metlugaa Maari Yesulo Ediginchani Thana Vaakyam Neelo Veligi Cheekati Tholaginchani (2) ||Phalitha|| Mandinche Aggithone Merayunu Bangaaramu Shodhanala Kolimilone Balapadu Vishwaasamu (2) Nee Tharapuna Yuddham Chese Yehovaa Nee Anda Tholagipoku Aa Maargaanni Thana Aagnanau Vinakundaa (2) ||Phalitha|| Kanaledaa Siluvalona Yesu Raaju Kashtamu Thaanondina Shramala Dwaaraa Nashiyinche Paapamu (2) Nee Shramala Kaalamlone Manasu Drudamu Kaavali Thirigi Neelo Putte Paapam Beejamu Nashiyinchaali (2) ||Phalitha|| Priyamaina Puthruni Manaki Naliginchina Devudu Appaginchaledaa Sakalam Sarva Shakthimanthudu (2) Thana Sannidhi Raavaalantu Ninnu Koruthunnaadu Neethi Neelo Penchetanduku Thapana Paduthu Unnaadu (2) ||Phalitha||