భయపడకుము నీవు యుద్ధము యెహోవదే - YouWorship
Bhayapadakumu Neevu Yuddhamu Yehovade
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: భయపడకుము నీవు - యుద్ధము యెహోవదే నిశ్చయముగ జయము - నీదే భయపడకుము - భయపడకుము నీవు (1) 1. గర్జించు సింహమువలె శత్రువు - నీపైని బడ జూచుచుండె (2) నదివలె నీపై పారవచ్చును (2) - యుద్ధము యెహోవదే భయపడకు (2) 2. పాలు తేనెలు ప్రవహించెడు - కానాను మీయెదుట నుండె శత్రువు నిన్ను జంపజూచె - యుద్ధము యెహోవదే భయపడకు 3. నీకు విరోధముగ రూపించు - యే ఆయుధము వర్ధిల్లదు ప్రతి నాలుక తీర్పుకు లోనగును - యుద్ధము యెహోవదే భయపడకు 4. ఇహపరమునందు మన ప్రభువునకు - సర్వాధికారము నియ్యబడెను ఆయన సన్నిధి నీతో యుండును - యుద్ధము యెహోవదే భయపడకు 5. నీవు పోరాడెడు పనిలేదు - నమ్మకముంచి విశ్వాసముతో రక్షణను తిలకించుము - జయము ప్రభువుదే భయపడకు Pallavi: Bhayapadakumu Neevu - Yuddhamu Yehovade Nishchayamuga Jayamu - Neede Bhayapadakumu - Bhayapadakumu Neevu (1) 1. Garjinchu Sinhamuvale Shathruvu - Neepaini Bada Joochuchunde (2) Nadivale Neepai Paaravachchunu (2) - Yuddhamu Yehovade Bhayapadaku (2) 2. Paalu Thenelu Pravahinchedu - Kaanaanu Meeyeduta Nunde Shathruvu Ninnu Jampajooche - Yuddhamu Yehovade Bhayapadaku 3. Neeku Virodhamuga Roopinchu - Ye Aayudhamu Vardhilladu Prathi Naaluka Theerpuku Lonagunu - Yuddhamu Yehovade Bhayapadaku 4. Ihaparamunandu Mana Prabhuvunaku - Sarvaadhikaaramu Niyyabadenu Aayana Sannidhi Neetho Yundunu - Yuddhamu Yehovade Bhayapadaku 5. Neevu Poraadedu Paniledu - Nammakamunchi Vishvaasamutho Rakshananu Thilakinchumu - Jayamu Prabhuvude Bhayapadaku