భక్తుల సంఘమే ప్రభుని శరీరము - YouWorship
Bhakthula Sangghame Prabhuni Shareeramu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: భక్తుల సంఘమే - ప్రభుని శరీరము (1) అందాయన తన - పూర్ణత నింపును (2) 1. ఒక్క శరీరమునకు శిరస్సు నొకటేగా (2) సంఘమునకు ప్రభువే శిరస్సుగా (2) 2. శిరస్సునుండే యోచనలు వెలువడును శరీరము నందు ప్రకటింపబడున్ 3. యూదులని హెల్లే నీయులని లేదు దాసులనియు స్వతం త్రులనియు లేదు 4. కలవు శరీరములో అనేకావయవముల్ కలసి ఏకముగా నివసించుచుండున్ 5. కరములు కాళ్ళతో కలహించలేవు కలయకనే కార్యమును చేయలేవు 6. ఆత్మైక్యత నవ యవములు కలిగిన క్షేమాభివృద్ధిని దేహము బొందున్ 7. శిరస్సాధీనములో సర్వాంగములుండిన సేవలో ప్రభు పరిపూర్ణత యుండును Pallavi: Bhakthula Sangghame - Prabhuni Shareeramu (1) Andaayana Thana - Poornatha Nimpunu (2) 1. Okka Shareeramunaku Shirassu Nokategaa (2) Sangghamunaku Prabhuve Shirassugaa (2) 2. Shirassununde Yochanalu Veluvadunu Shareeramu Nandu Prakatimpabadun 3. Yoodulani Helle Neeyulani Ledu Daasulaniyu Svathan Thrulaniyu Ledu 4. Kalavu Shareeramulo Anekaavayavamul Kalasi Ekamugaa Nivasinchuchundun 5. Karamulu Kaallatho Kalahinchalevu Kalayakane Kaaryamunu Cheyalevu 6. Aathmakyatha Nava Yavamulu Kaligina Kshemaabhivruddhini Dehamu Bondun 7. Shirassaadheenamulo Sarvaanggamulundina Sevalo Prabhu Paripoornatha Yundunu