ప్రేమగల మా ప్రభువా - YouWorship
Premagala Maa Prabhuvaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా (2) ||ప్రేమగల|| నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2) నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2) ||ప్రేమగల|| అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2) అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2) ||ప్రేమగల|| బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2) వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను (2) ||ప్రేమగల|| తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2) తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే (2) ||ప్రేమగల|| మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా (2) వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను (2) ||ప్రేమగల|| Premagala Maa Prabhuvaa Premayai Yunnaavayaa (2) ||Premagala|| Needu Prema Nithyamainadi – Karunatho Naakarshinche (2) Nikkamuga Rujuvaayenu – Praanamichchuta Dwaarane (2) ||Premagala|| Andarini Rakshinchagori Lokamunu Preminchenu (2) Adbhutha Prema Yide Paapamulanu Kappenu (2) ||Premagala|| Balamagu Yee Prema Manala Kreesthulo Bandhinchenu (2) Vallapadadu Evariki Kreesthu Premanu Baapanu (2) ||Premagala|| Thalliyaina Marachugaani Neevu Yennadu Maruvavu (2) Thandri Prema Maaradu – Maarpuchendani Premaye (2) ||Premagala|| Maranamantha Balamugaladi Needu Prema Prabhuvaa (2) Varadalaarpajaalavu Vijayudaa Nee Premanu (2) ||Premagala||