ప్రియ యేసు రాజును - YouWorship
Priya Yesu Raajunu Ne Choochina Chaalu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2) నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు (2) ||ప్రియ యేసు|| యేసుని రక్తమందు కడుగబడి వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2) నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2) బంగారు వీదులలో తిరిగెదను (2) ||ప్రియ యేసు|| ముండ్ల మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2) కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2) ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2) ||ప్రియ యేసు|| హృదయము స్తుతులతో నింపబడెను నా భాగ్య గృహమును స్మరించుచు (2) హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2) వర్ణింప నా నాలుక చాలదయ్యా (2) ||ప్రియ యేసు|| ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో (2) తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో (2) ఆశతో వేచియుండే నా హృదయం (2) ||ప్రియ యేసు|| Priya Yesu Raajunu Ne Choochina Chaalu Mahimalo Nenaayanatho Unte Chaalu (2) Nithyamaina Mokshagruhamu Nandu Cheri Bhakthula Gumpulo Harshinchina Chaalu (2) ||Priya Yesu|| Yesuni Rakthamandu Kadugabadi Vaakyamche Nithyam Bhadraparachabadi (2) Nishkalanka Parishudhdhulatho Pedan Nenu (2) Bangaaru Veedulalo Thirigedanu (2) ||Priya Yesu|| Mundla Makutambaina Thalanu Joochi Swarna Kireetam Betti Aanandinthun (2) Koradaatho Kottabadina Veepun Joochi (2) Prathi Yokka Gaayamunu Mudhdhaadedan (2) ||Priya Yesu|| Hrudayamu Sthuthulatho Nimpabadenu Naa Bhaagya Gruhamunu Smarinchuchu (2) Hallelooya Aamen Hallelooya (2) Varnimpa Naa Naaluka Chaaladayyaa (2) ||Priya Yesu|| Aaha Aa Boora Eppudu Dhvaninchuno Aaha Naa Aasha Eppudu Theeruthundo (2) Thandri Naa Kanneetini Thuduchuneppudo (2) Aashatho Vechiyunde Naa Hrudayam (2) ||Priya Yesu||