ప్రియ యేసుని సైన్య వీరులము - YouWorship
Priya Yesuni Sainya Veerulamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రియ యేసుని సైన్య వీరులము - సైన్య వీరులము సైన్యవీరులము (1) శ్రేయంపు సిలువను మోసెదము - సైన్య వీరులము సైన్యవీరులము (1) 1. మన తండ్రి సమాధాన ప్రభువు - మన సర్వాయుధము మన నమ్రతయే (2) మన ఆత్మ సహాయకు డాయనే - సైన్య వీరులము సైన్యవీరులము (2) 2. ఎల్లప్పుడు యేసుని ధ్యానింతుము - ఎల్లరము జీవము నొసగెదము చల్లని యేసు ప్రేమకై సమర్పింతుము - సైన్య వీరులము సైన్య వీరులము 3. యేసు క్రీస్తుని ప్రేమకై చనిపోదుము - యేసుకై కాయ కసరులనైన తిందుము వేసినట్టి ముందంజను వెనుదీయము - సైన్యవీరులము సైన్యవీరులము 4. లోక స్నేహపు బంధముల్ త్రుంచితిమి - లోక మాయల నెల్లను విడిచితిమి వీకతో ప్రభుని కెదల నిచ్చితిమి - సైన్య వీరులము సైన్య వీరులము 5. రక్షణమార్గమిదేయని యెరిగితిమి - అక్షయంబుగ నాత్మలో నాటితిమి లక్ష్యబెట్టము చావు బ్రతుకులను - సైన్య వీరులము సైన్య వీరులము 6. వైరికోటల నాశంబు గావింతుము - కోరి శుభవేళ సత్యంబు చాటెదము చేరిసాక్ష్యము లీయను భయపడము - సైన్య వీరులము సైన్య వీరులము 7. హల్లెలూయా జయంబును తెలిపెదము - ఉల్లాసముతో ప్రభునిరాక చాటెదము ఎల్ల పాపాంధకారముల్ బాపెదము - సైన్య వీరులము సైన్య వీరులము Pallavi: Priya Yesuni Sainya Veerulamu - Sainya Veerulamu Sainyaveerulamu (1) Shreyampu Siluvanu Mosedamu - Sainya Veerulamu Sainyaveerulamu (1) 1. Mana Thandri Samaadhaana Prabhuvu - Mana Sarvaayudhamu Mana Namrathaye (2) Mana Aathma Sahaayaku Daayane - Sainya Veerulamu Sainyaveerulamu (2) 2. Ellappudu Yesuni Dhyaaninthumu - Ellaramu Jeevamu Nosagedamu Challani Yesu Premakai Samarpinthumu - Sainya Veerulamu Sainya Veerulamu 3. Yesu Kreesthuni Premakai Chanipodumu - Yesukai Kaaya Kasarulanaina Thindumu Vesinatti Mundanjanu Venudeeyamu - Sainyaveerulamu Sainyaveerulamu 4. Loka Snehapu Bandhamul Thrunchithimi - Loka Maayala Nellanu Vidichithimi Veekatho Prabhuni Kedala Nichchithimi - Sainya Veerulamu Sainya Veerulamu 5. Rakshanamaargamideyani Yerigithimi - Akshayambuga Naathmalo Naatithimi Lakshyabettamu Chaavu Brathukulanu - Sainya Veerulamu Sainya Veerulamu 6. Vairikotala Naashambu Gaavinthumu - Kori Shubhavela Sathyambu Chaatedamu Cherisaakshyamu Leeyanu Bhayapadamu - Sainya Veerulamu Sainya Veerulamu 7. Hallelooyaa Jayambunu Thelipedamu - Ullaasamutho Prabhuniraaka Chaatedamu Ella Paapaandhakaaramul Baapedamu - Sainya Veerulamu Sainya Veerulamu